భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి సెంట్రల్వర్క్షాప్ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కంపెనీ ఈఅండ్ఎం డైరెక్టర్ తిరుమలరావు అన్నారు. గురువారం సెంట్రల్వర్క్షాపును సందర్శించారు. వర్క్‌షాపులో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఫౌండ్రీ సెక్షన్, మెషిన్షాప్, ఫ్యాబ్రికేషన్, క్వాలిటీ విభాగాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్వర్క్షాప్ సంస్థకు కీలకమైందన్నారు. ఆయన వెంట జీఎం రామ్మోహన్రావు, అధికారులు వేలాద్రి, కేశవరావు, నాగేశ్వరరావు, వెంకటరాజు, నారాయణరావు పాల్గొన్నారు.
