ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) వెల్నెస్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న 11 పోస్టులను అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ దివాకర ఆదివారం తెలిపారు. మెడికల్ ఆఫీసర్, డెంటల్ డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థులు సోమవారం నుంచి అక్టోబర్ 9 వరకు దరఖాస్తు ఫారాలు పొంది, అక్టోబర్ 12న సాయంత్రం 4 గంటలలోపు పూర్తి చేసిన దరఖాస్తులను అందజేయాలని సూచించారు.
