కొణిజర్ల, వెలుగు: ఖమ్మం జిల్లా కొణిజర్ల నుంచి దొనబండ వరకు రహదారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.21 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ ఈ నెల 26న జీఓఆర్‌టీ నంబర్ 510 జారీ చేసింది.
నిధుల మంజూరుకు కృషి చేసిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులకు తుమ్మలపల్లి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
