భద్రాచలం, వెలుగు: ముక్కోటి ఏకాదశి నాటికి ఉత్తర ద్వారం పనులు పూర్తి చేయాలని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో దామోదర్‌రావు ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లకు సూచించారు. ఈఈ రవీందర్రాజుతో కలిసి ఆయన గురువారం రామాలయ విస్తరణ పనులు తనిఖీ చేశారు. ఉత్తరం వైపు కూల్చివేతల అనంతరం నిర్మిస్తున్న 20 మీటర్ల పొడవైన రిటైనింగ్ వాల్‌ను పర్యవేక్షించారు. రక్షణ చర్యలను పరిశీలించారు. భక్తులు రాకుండా బారికేడ్లు ఏర్పాటుచేయాలని సూచించారు.
