విషాద ఘటన..పది నిమిషాలైతే ఇంటికి చేరుకునేవారు..స్యూల్ అయిపోయింది హ్యాపీగా ఇంటికి వెళ్లి పేరెంట్స్ తో ఎంజాయ్ చేద్దామనుకుందామనుకున్న ఆ చిన్నారులకు చెట్టు రూపంలో ప్రమాదం పొంచి ఉందని తెలియదు.. క్షణాల్లో జరగాల్సింది జరిగిపోయింది..జోరున గాలివానకు ఒక్కసారిగా స్కూల్ బస్సుపై విరిగిపడింది పెద్ద చెట్టు..బాధతో విద్యార్థుల అరుపులు.. పేరెంట్స్ ఏడుపు.. ఆ ప్రాంతమంతా విషాదంతో నిండిపోయింది.
మంగళవారం (జూన్30) మధ్యాహ్నం ముంబైలోని చెంబూరు ప్రాంతంలో భారీ వర్షం కారణంగా పెద్ద చెట్టు కూలి స్కూల్ బస్సుపై పడిన ఘటనతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.చెంబూర్ లోని11 నంబర్ రోడ్డులో ఓ పెద్ద రావిచెట్టు కూకటివేళ్లతో సహా కూలిపోయి ఓ స్కూల్ బస్సుపై పడింది. అంత పెద్ద చెట్టు పడటంతో స్కూల్ బస్సు నుజ్జునుజ్జయింది. వాహనంలో చిక్కుకుని ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా..12 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి.
ఈప్రమాదంలో ఓ విద్యార్థికి బలంగాగాయాలు కావడంతో స్పాట్ లోనే చనిపోయాడు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ముంబై ఫైర్ రెస్క్యూటీం, బీఎంసీ టీం, ఎమర్జెన్సీ మెడికల్ టీంకు స్పందించడంతో కొంతమంది విద్యార్థులను ప్రాణాలు దక్కాయి. కూలిపోయిన చెట్టును తొలగిండచంతో సకాలంలో విద్యార్థులను బస్సునుంచి బయటికి తీసి సమీపంలోని ఆస్పత్రులకు తరలించడంతో మిగతి విద్యార్థులు సేఫ్ గా ఉన్నారు.
►ALSO READ | ఏదైనా జరిగితే ధర్మేంద్ర ప్రధాన్ దే బాధ్యత.. క్షీణిస్తున్న వాంగ్ చుక్ ఆరోగ్యంపై సీజేపీ చీఫ్
గత కొన్ని రోజులుగా ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాల మధ్య ఈ విషాదం చోటుచేసుకుంది. గతంలో చెంబూర్‌లో భారీ వర్షాలతోచెట్లు, కొమ్మలు విరిగిపడటంతో పలువురు చనిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ విషాదంతో వర్షాకాలంలో ముంబై చెట్ల భద్రతపై మరోసారి దృష్టిని ఆకర్షించింది. ప్రతి సంవత్సరం, భారీ వర్షాలు ,ఈదురుగాలులతో నగరం అంతటా చెట్లు, కొమ్మలు కూలిపోయే అనేక సంఘటనలు జరుగుతాయి. ఇవి తరచుగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో ప్రాణనష్టానికి కూడా కారణమవుతాయి. విద్యార్థి మృతితో రహదారి పక్క చెట్ల వల్ల కలిగే ప్రమాదాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
