ఏదైనా జరిగితే ధర్మేంద్ర ప్రధాన్ దే బాధ్యత.. క్షీణిస్తున్న వాంగ్ చుక్ ఆరోగ్యంపై సీజేపీ చీఫ్ 

ఏదైనా జరిగితే ధర్మేంద్ర ప్రధాన్ దే బాధ్యత.. క్షీణిస్తున్న వాంగ్ చుక్ ఆరోగ్యంపై సీజేపీ చీఫ్ 

దేశవ్యాప్తంగా  కాంపిటిటివ్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ లకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనకు మద్దతుగా పర్యావరణ కార్యకర్త వాంగ్ చుక్ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. గత మూడు రోజుల్లో వాంగ్ చుక్  బ్లడ్ షుగర్ లెవల్స్ 66 కి పడిపోయాయని ఆయన పరిస్థితి పూర్తిగా క్షీణించిందని డాక్టర్లు చెప్పారు. ఈ క్రమంలో వాంగ్ చుక్ కు ఏదైనా జరగరానికి జరిగితే ధర్మేంద్ర  ప్రధాన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే హెచ్చరించారు.

విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై కాక్రోచ్ పార్టీ చేస్తున్న ఆందోళనకారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆరోపించారు. నిరసన ప్రదేశంలో పోర్టబుల్ టాయిలెట్ కు పోలీసులు నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.  నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు బల ప్రయోగం చేశారని సీజీపీ చీఫ్ అభిజిత్ దీప్కే విమర్శించారు. ఢిల్లీ పోలీసులు అమాయకపు ఎస్ ఎస్ సీ విద్యార్థులపై దాడి చేయడం దారుణం అన్నారు. దేశ భవిష్యత్తుకు హాని కలిగించే ఆదేశాలన పోలీసులు పాటించొద్దు.. మీరు దేశంకోసం యూనిఫాం వేశారు. పార్టీకోసం కాదు.. సరైన నిర్ణయంతో యువతను రక్షించాలని పోలీసులనుద్దేశించిప్రకటన చేశారు. 

ఇదిలా వుంటే వాంగ్ చుక్ కు మద్దతు తెలిపేందుకు మంగళవారం  జంతర్ మంతర్ దగ్గరకు వందలాది ప్రదర్శనకారులు వచ్చారు. వీరిలో అధిక శాతం విద్యార్థులు ,యువకులే ఉన్నారు. రెండు నిమిషాలు మౌనం పాటించి ర్యాలీ ప్రారంభించారు. ఇందులో రైతులు కూడా పాల్గొనడం విశేషం. 

దేశవ్యాప్తంగా కాంపిటిటివ్ ఎగ్జామ్స్  పేపర్స్ లీకేజీతో విద్యా్ర్థులకు తీరని నష్టం కలుగుతుందని, ఈ పరిస్థితికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ  జూన్ 20 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఆందోళనలు చేస్తోంది. ఈ ఆందోళనకు విద్యార్థులు, రైతులు పౌర సమాజం సభ్యులు మద్దతు తెలిపి నిరసనల్లో పాల్గొన్నారు.