ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడకూడదు అంటే లైట్ తీసుకుంటాం కదా.. అందులో వర్షం వస్తున్నపుడు అసలే డేంజర్. ఈ విషయం తెలిసినా కూడా హా ఏముందిలే.. అని వాడేస్తుంటాం. అంతలా అడిక్ట్ అయిపోయాం అనిపిస్తుంటుంది ఆ ధోరణి చూస్తే. కానీ ఎందుకు వాడకూడదో.. ఎందుకు డేంజరో ఈ ఘటనే బెస్ట్ ఉదాహరణ.
ఒడిషాలోని కోరాపుట్ జిల్లాలో 2026 ఆగస్టు 13న మొబైల్ పేలిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనలకు గురిచేసింది. బయట వర్షం కురుస్తుండగా ఫోన్ ఛార్జింగ్ పెట్టి వాడుతుండటంతో.. ఒక్కసారిగా పేలిపోయింది. నందపూర్ బ్లాక్ లోని కొసాండి పంచాయత్ దరేంగాబ గ్రామంలో జరిగింది ఈ విషాద ఘటన. మొబైల్ పేలిన ఘటనలో జగన్నాత్ సిసా కుమారుడు భగీరతి సిసా చనిపోయాడు.
నందపూర్ ఏరియాలో వర్షం కురుస్తుండగా.. ఛార్జింగ్ పెట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మొబైల్ వాడుతున్నాడు భగీరథి. ఒక్కసారిగా పిడుగులు, మెరుపులతో.. హెవీ కరెంట్ పాస్ అయ్యి.. కరెంట్ షాక్ తో చనిపోయాడు. మెరుపులకు ఫోన్ లో ఎలాంటి వార్నింగ్ కూడా రాకుండానే ఇంత ఘోరం జరిగినట్లు పేరెంట్స్ చెప్పారు.
ఘటన జరిగిన వెంటనే 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించినా.. లాభం లేకుండా పోయింది. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వర్షం వస్తుండగా ఫోన్ వాడకపోవడం మంచిదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టి వాడకూడదని.. ఛార్జింగ్ పెట్టి ఇయర్ ఫోన్స్ పెట్టి ఫోన్ వాడటం మరీ డేంజర్ అని చెబుతున్నారు.
