బెంగళూరులాంటి మెట్రో సిటీల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు అధికంగా కనిపిస్తాయి. ముఖ్యంగా చాలామంది కాలనీలలో రోడ్లపైన, ఇళ్ల ముందు తమ వాహనాలను పార్కింగ్ చేస్తుంటారు. దీంతో వాహనాదారులు, కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతుంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు బెంగళూరు మున్సిపల్ అథారిటీ కొత్త రూల్స్ తెస్తోంది. ఇళ్లముందు, రోడ్లపైనా కార్లు పార్కింగ్ చేస్తే భారీ ఎత్తున జరిమానా విధించేందుకు రెడీ అవుతోంది.
రోడ్లపైనా, ఇళ్లముందు కార్లు పార్కింగ్ చేస్తే మాగ్జిమమ్ ఏడాది 25 వేల ఫైన్ కట్టాల్సిందే. అయితే వాహనాల రకాలను బట్టి జరిమానా విధిస్తారు. హ్యాచ్ బ్యాక్ లకు రూ.15వేలు, సెడాన్లకు 20వేలు, స్పోర్ట్స యూటిలిటీ కార్లకు 25 వేల వరకు జరిమానా విధించేలా కొత్త రూల్స్ కు సంబంధించిన నిబంధన ముసాయిదాను ప్రతిపాదించింది గ్రేటర్ బెంగళూరు అథారిటీ.
ఇంటి ముందు పబ్లిక్ రోడ్డుపై వాహనం పార్క్ చేసే వారికి షాక్ ఇచ్చింది గ్రేటర్ బెంగళూరు అథారిటీ( GBA). కొత్త పార్కింగ్ రూల్స్ కోసం 2026 జీబీఏ పార్కింగ్ నిబంధనల ముసాయిదా రెడీ చేసింది. కొత్త రూల్స్ ప్రకారం.. వాహనం రకాన్ని బట్టి ఏడాదికి రూ.25 వేల వరకు రెసిడెన్షియల్ పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. హ్యాచ్‌బ్యాక్‌లకు రూ.15 వేలు, సెడాన్‌లకు రూ.20 వేలు, ఎస్‌యూవీలకు రూ.25 వేలు చెల్లించేలా ప్రణాళికలు సిద్దం చేసింది.
అయితే, మెయిన్ రోడ్డు, సబ్ మెయిన్ రోడ్లు మినహాయించి ఇతర రోడ్లపై మాత్రమే అనుమతితో పార్కింగ్‌కు చేసుకోవచ్చు. కార్పొరేషన్ జారీ చేసిన రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్ తప్పనిసరి. భవన నిబంధనల ప్రకారం ఇంట్లో తగిన పార్కింగ్ స్థలం ఉన్నవారికే ఈ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.అనుమతి లేకుండా ఇంటి ముందు పబ్లిక్ రోడ్డుపై వాహనం నిలిపితే దాన్ని అక్రమ పార్కింగ్‌గా పరిగణించి జరిమానా విధించవచ్చు.
పార్కింగ్‌కు అనుమతి ఇచ్చే రోడ్లలో ట్రాఫిక్, పాదచారులకు తగినంత స్థలం ఉండేలా నిబంధనలు ప్రతిపాదించారు. రూల్స్ అతిక్రమిస్తే భారీ ఫైన్లతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తప్పవు.
