ఆకాశంలో అద్భుతం జరిగింది. హైదరాబాద్ లో స్ట్రాబెర్రీ మూన్ కనువిందు చేసింది. జూన్ లో వచ్చే ఈ పౌర్ణమికి స్ట్రాబెర్రీ మూన్ అనే పేరుంది. 2026 జూన్ 29 సాయంత్రం వచ్చిన ఈ ప్రత్యేక పౌర్ణమిని నగరవాసులు ఎంతో ఉత్సాహంతో వీక్షించారు. హైదరాబాద్ లో సెక్రటేరియట్, అంబేడ్కర్ స్టాచ్యూ పైనుంచి తీసిన ప్రత్యేక పౌర్ణమి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వర్షా కాలం ఆరంభం తర్వాత.. రుతుపవనాలు వచ్చిన తర్వాత వచ్చే పౌర్ణమి కోసం హైదరాబాదీలు సాయంత్రం నుంచే ఎదురు చూశారు. పౌర్ణమి రావడంతో చూసి సంతోషం వ్యక్తం చేశారు.
స్ట్రాబెర్రీ మూన్ అంటే..
స్ట్రాబెర్రీ మూన్ అంటే.. పేరు వినగానే చంద్రుడు గులాబీ రంగులో ఉంటాడని అనుకుంటారు. కానీ, వాస్తవానికి ఇది ప్రకాశవంతమైన బంగారు
లేదా లేత నారింజ రంగులో కనిపిస్తుంది. ఉత్తర అమెరికా సంప్రదాయాల ప్రకారం జూన్ పౌర్ణమికి ఈ పేరు వచ్చింది.
►ALSO READ | ఇళ్లలోని పాత బంగారం అమ్మేస్తున్న జనం.. కారణం ఇదే.. ఇలా అమ్ముకోవడం మంచిదా..? కాదా..?
2026 స్ట్రాబెర్రీ మూన్‌కు మరింత విశిష్టత ఉంది. ఎందుకంటే ఇది జూన్ 21న జరిగిన ఉత్తరార్థగోళ వేసవి అయనాంతం (Summer Solstice) తర్వాత వచ్చే తొలి పౌర్ణమి. దీని కారణంగా 2026లో కనిపించే అన్ని పౌర్ణముల్లో ఇదే అతి తక్కువ ఎత్తులో ప్రయాణించే చంద్రుడిగా నిలుస్తుంది. రాత్రంతా దక్షిణ దిక్కుకు దగ్గరగా సంచరిస్తూ ఆకాశంలో ప్రత్యేకమైన అందాన్ని సంతరించుకుంటుంది.
సమయం, వివరాలు:
- చంద్రోదయం (Moonrise): సాయంత్రం 07:00 నుండి 07:30 గంటల మధ్య.
- వీక్షించడానికి ఉత్తమ సమయం: రాత్రి 07:30 నుండి 09:30 గంటల మధ్య.
- పర్ఫెక్ట్ సమయం: జూన్ 30 తెల్లవారుజామున 05:26 గంటలకు చంద్రుడు పూర్తి ప్రకాశంతో వెలుగుతుంటుంది.
ఇలా చూడండి:
చంద్రుడు ఉదయించే సమయంలో తూర్పు-ఆగ్నేయ దిశ (East-Southeast direction) వైపు చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది.
ఎలాంటి ప్రత్యేక పరికరాలు (టెలిస్కోప్) లేకుండానే స్పష్టంగా చూడవచ్చు.
పౌర్ణమి పౌష్టంగా కనిపించాలంటే సిటీ లైట్లకు దూరంగా ఉన్న ప్రదేశాలు లేదా డాబా లేదా ఓపెన్ గ్రౌండ్స్ ఎంచుకోవడం మంచిది.
