హైదరాబాద్: IIIT జంక్షన్ దగ్గర జరుగుతున్న మల్టీ-లెవల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులలో భాగంగా, DLF గేట్ నం.1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకూ ఉన్న రహదారిని జూలై 1, 2026 నుంచి 90 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో.. ప్రయాణికులకు కొన్ని డైవర్షన్స్ను ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవే:
* రాడిసన్ హోటల్ నుంచి IIIT జంక్షన్ వైపు వచ్చే వాహనాలను DLF గేట్ నం. 1 వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడి నుంచి.. గచ్చిబౌలి జంక్షన్ → ఇందిరానగర్ → IIIT జంక్షన్ మార్గాన్ని ఉపయోగించాలి.
* లింగంపల్లి నుంచి DLF వైపు వెళ్లే వాహనాలను.. గచ్చిబౌలి ట్రాఫిక్ PS → IIITజంక్షన్ → గచ్చిబౌలి జంక్షన్ → రాడిసన్ జంక్షన్ → DLF మార్గంలోకి మళ్లిస్తారు.
* Non-SEZ (CMC) గేట్‌ను ఉపయోగించే TCS ఉద్యోగులు తమ ఎంట్రీ, ఎగ్జిట్ రూట్ను ఎప్పటిలానే ఉపయోగించవచ్చు.
* ఫ్లైఓవర్ పనులు సుమారు ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉంది. అందువల్ల.. IIIT జంక్షన్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది. ప్రయాణికులు వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Traffic advisory for Hyderabad’s IT corridor.
— FutureHyderabad (@FutureHyderabad) June 29, 2026
From July 1, the road stretch between DLF Gate No.1 and Gachibowli Traffic Police Station will remain closed for 90 days due to ongoing flyover and underpass works at IIIT Junction.
While access to the TCS Non-SEZ (CMC) Gate remains… pic.twitter.com/jovou07MWe
