టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కథనాయకుడిగా వస్తున్న చిత్రం 'లెనిన్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని' వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ అబ్బూరు మురళీ కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకుని జూలై 10న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. లేటెస్ట్ గా చిత్రం అఫీషియల్ ట్రైలర్ ను వైజాగ్ లో ఈ రోజు ( జూన్ 30, 2026 ) రిలీజ్ చేశారు.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, లేటెస్ట్ ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
ఈ ట్రైలర్ కు నాగార్జున వాయిస్ ఓవర్ అందించారు. రాయలసీమ రూరల్ బ్యాక్స్ డ్రాప్ లో యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్షన్ తో పాటు ప్రేమకథతో ఈ చిత్రం రూపుదిద్దుకున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దీనిలో ఫైట్స్ చూస్తే రాయలసీమ ఫ్యాక్షన్ ను గుర్తుకుతెస్తోంది.
కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పారో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలని, ఏంది అట్టనే సేద్దామా అని అఖిల్ చెప్పే డైలాగ్ ఈ చిత్రంపై అంచనాలను పెంచేసింది. ఇందులో అఖిల్ సరికొత్త రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్నారు. అంతే కాదు కురుక్షేత్రంలో అఖరి ఘట్టం విశ్వరూపం అని సునిల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. వరుస అపజాయాలతో ఉన్న అఖిల్ ఈ సినిమాతో హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
