వెనుజువెలాలో భారత నావికుడి మిస్టరీ డెత్.. బాడీలో ఒక్క ఆర్గాన్ లేదు..పోస్ట్‌మార్టమ్ లో బయటపడిన షాకింగ్ నిజాలు!

వెనుజువెలాలో భారత నావికుడి మిస్టరీ డెత్.. బాడీలో ఒక్క ఆర్గాన్ లేదు..పోస్ట్‌మార్టమ్ లో బయటపడిన షాకింగ్ నిజాలు!

భారతీయ నావికుడు రాకేష్ చౌహాన్ వెనిజులాలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎలాంటి పోస్ట్ మార్టమ్ రిపోర్టు ఇవ్వకుండానే వెనిజులా అధికారులు రాకేష్ చౌహాన్ డెడ్ బాడీని ఇండియాకు పంపినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి మరోసారి శవపరీక్ష నిర్వహించాలని కోరడంతో  రాకేష్ మృతిపట్ల అనేక అనుమానాలను రేకెత్తించింది.

చౌహాన్ కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకుభారత్‌లో నిర్వహించిన శవపరీక్షలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బాడీలో ఏ ఒక్క అవయవం కూడా లేదని తేలింది. మెదడు, గుండె,ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు,ఇలా శరీరంలో ఏ ఒక్క అవయవం కూడా లేదని పోస్ట్ మార్టమ్ రిపోర్డు లో వెల్లడైంది.డెడ్ బాడీపై పెద్దఎత్తున ఆపరేషన్ చేసిన కుట్లు కనిపించాయి.  మృతికి గల ఖచ్చిత మైన కారణాలు వెల్లడి కాలేదు. స్వదేశం లో నిర్వహించిన పోస్ట్ మార్ట్ రిపోర్టులు కుటుంబ సభ్యులను మరింత కలవరపెట్టాయి.

ఈ ఘటన ఒక్క కుటుంబానిదే కాదు, విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ సముద్ర నావికుల భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. సముద్రయానంలో పనిచేసే సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తగిన రక్షణ, పారదర్శక విచారణ, చట్టపరమైన సహాయం పొందేలా వ్యవస్థలు మరింత బలపడాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి,చౌహాన్ మృతికి గల అసలు కారణాలను వెల్లడించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే వెనిజులా అధికారులు, అక్కడి భారత రాయబార కార్యాలయం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిజానిజాలు వెలికితీయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.