జపాన్ దేశాన్ని అల్లకల్లోలం చేసిన వర్షాలు : మునిగిపోయిన చిబా సిటీ

జపాన్ దేశాన్ని అల్లకల్లోలం చేసిన వర్షాలు : మునిగిపోయిన చిబా సిటీ

జపాన్ లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు జపాన్ లోని చీబా సిటీతో పాటు పరిసర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు చీబా నగరం మొత్తం నీటమునిగింది. రోడ్లన్నీ నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, నివాస ప్రాంతాల్లో వరద నీరు చేరి  ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైళ్లు, విమానాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.  చీబా రైల్వే స్టేషన్ లో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.  ప్రముఖ నరిటా ఎయిర్ పోర్టుకు విమానాలు రద్దు కావడంతో దాదాపు 6 వేల మంది ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలోనే  ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 

వరద నీటిలో  కార్లు పడవల్లా తేలియాడుతున్నాయి. భారీ వర్షాలు , వరదలతో పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో చిబాలోని కొన్ని ప్రాంతాలకు అధికారులు భారీ రెయిన్ అలర్ట్ జారీ చేయడంతో చిబాలో నెలకొన్న పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

తూర్పు జపాన్ లో  రికార్డు స్థాయిలో వర్షాలకు కురవడంతో ఐదుగురు మృతిచెందారు నలుగురు గల్లంతయ్యారు.రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విమానాలు రద్దయ్యాయి. దీంతో  వేలాది మంది నరిటా ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయారు. 

చిబా నగరంలో  170కి పైగా ఇళ్లు వరదలకు గురవగా, మరో 90 ఇళ్లలో వరద నీరు చేరింది. భారీ వర్షాలు, వరదలతో చిబాలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శుక్రవారం ఉదయం సుమారు 26వేల ఇళ్లకు విద్యుత్ నిలిచిపోయింది. మరింత వర్షం కురిసే అవకాశం ఉండటంతో అధికారులు వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

భారీ వర్షాలు, వరదలతో చిబాలో రైళ్లరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నరిటాకు రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేయడంతో చిబా స్టేషన్‌లో వందలాదిమంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.