నాకూ మూడోసారి పోటీ చేయాలనే ఉంది..కానీ రాజ్యాంగం ఒప్పుకోదు: ట్రంప్

నాకూ మూడోసారి పోటీ చేయాలనే ఉంది..కానీ రాజ్యాంగం ఒప్పుకోదు: ట్రంప్

వాషింగ్టన్: 2028 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే అమెరికా రాజ్యాంగంలోని నిబంధనలు అడ్డుగా ఉన్నాయన్నారు.  మంగళవారం మేరీల్యాండ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ..  ‘‘మళ్లీ పోటీ చేయడం నాకు కూడా ఇష్టమే.. కానీ చట్టం చాలా బలంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘అందరూ నేను మళ్లీ పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఈ రోజు కార్యక్రమంలోనూ ‘2028’ అంటూ నినాదాలు చేశారు. కానీ నిబంధనలు ఒప్పుకోవు’’ అని అన్నారు.