ఆకలి తీర్చుకోవడానికి అడుక్కునే స్థితికి దిగజారిన తల్లి.. కంటతడి పెట్టిస్తున్న 'స్లమ్‌ డాగ్‌' ఎమోషనల్ గ్లింప్స్!

ఆకలి తీర్చుకోవడానికి అడుక్కునే స్థితికి దిగజారిన తల్లి.. కంటతడి పెట్టిస్తున్న 'స్లమ్‌ డాగ్‌' ఎమోషనల్ గ్లింప్స్!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'స్లమ్‌ డాగ్‌: 33 టెంపుల్‌ రోడ్‌'.  వీరిద్దరి కాంబోలో  మూవీ ప్రకటించగానే అంచనాలు భారీస్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. 

లేటెస్ట్ గా పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ సినిమా నుంచి బాలీవుడ్ సీనియర్ నటి జరీనా వహాబ్ పాత్రకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆమె 'జుబైదా' అనే అత్యంత భావోద్వేగభరితమైన పాత్రలో కనిపిస్తున్నారు. ప్రేమతో కూడిన హృదయం.. పోరాటాలతో నిండిన జీవితం అంటూ విడుదల చేసిన క్యాప్షన్ ఆడియన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది.

ఆకలి తీర్చుకోవడానికి అడుక్కునే స్థితికి దిగజారిన ఒక తల్లి పడే వేదనను జరీనా వహాబ్ తన నటనా విశ్వరూపంతో జీవం పోశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఇచ్చిన నేపథ్య సంగీతం ఈ సీన్‌లోని భావోద్వేగాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ గింప్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.

సరికొత్త మాస్ అండ్ ఎమోషనల్ కథాంశంతో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా అలరించనుంది. కన్నడ నటసింహం దునియా విజయ్ పవర్ ఫుల్ విలన్‌గా దుమ్మురేపబోతున్నారు. అలాగే సీనియర్ నటి టబు, బ్రహ్మాజీ, VTV గణేష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సామ్ కె. నాయుడు డార్క్ అండ్ రా విజువల్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, JB నారాయణ్ రావు కొండ్రోళ్ల సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ 'స్లమ్ డాగ్'. త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో రచ్చ చేయడానికి థియేటర్లలోకి రాబోతోంది. పూరీ మార్క్ పవర్, విజయ్ సేతుపతి యాక్టింగ్ కాంబో వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.