రేపే ఆఫ్ఘనిస్తాన్తో క్వార్టర్ ఫైనల్.. భారత్ మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు!

రేపే ఆఫ్ఘనిస్తాన్తో క్వార్టర్ ఫైనల్.. భారత్ మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు!

India vs Afghanistan: జపాన్ (Japan)లోని నిస్షిన్ (Nisshin) వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 (Asian Games 2026)లో గోల్డ్ మెడల్ (Gold medal)ను నిలబెట్టుకోవడానికి బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు (Team India)కు తొలి మ్యాచ్ కి ముందే వర్షం రూపంలో పెద్ద గండం ఎదురైంది. సోమవారం (సోమవారం, సెప్టెంబర్ 28) కొరోగి స్పోర్ట్స్ పార్క్ (Korogi Sports Park)లో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan)తో జరగనున్న కీలకమైన క్వార్టర్ ఫైనల్ (Quarter-final) మ్యాచ్‌పై వర్షం ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

రేపటి మ్యాచ్ కి వర్షం అడ్డంకి: 

రేపు ఉదయం 10 గంటలకి (జపాన్ లోకల్ సమయం, మధ్యాహ్నం 14:00 గంటలకు) (Local time) ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్‌కు వాతావరణం సహకరించేలా కనిపించడం లేదు. ప్రముఖ వాతావరణ సంస్థ ఆక్యూవెదర్ (Accuweather) నివేదిక ప్రకారం, మ్యాచ్ ప్రారంభ సమయంలో వర్షం కురిసే అవకాశం ఏకంగా 70 శాతంగా ఉంది. అంతేకాకుండా మేఘావృతం (Cloud cover) 97 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ఇక సాయంత్రం సమయంలో పరిస్థితి మరింత దిగజారి, వర్షపాతం 100 శాతానికి, మేఘావృతం 99 శాతానికి చేరుకునే ప్రమాదం ఉంది.

మ్యాచ్ రద్దయితే ఏంటి పరిస్థితి: 

ఒకవేళ వరుణుడి ప్రభావంతో మ్యాచ్ పూర్తిగా రద్దయితే, టోర్నమెంట్ నిబంధనల ప్రకారం మెన్ ఇన్ బ్లూ (Men in Blue) జట్టుకే పూర్తి లాభం చేకూరనుంది. హయ్యర్ సీడింగ్ (Higher seeding) కారణంగా భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్ (Semi-finals)లోకి దూసుకెళ్తుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 13 టీ20 (T20I) మ్యాచ్‌లలో భారత్ 12 సార్లు విజయం సాధించగా, ఒకటి రద్దయింది. ఇటీవల జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా భారత్ 3–0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.

►ALSO READ | విండీస్ బ్యాటర్ల రచ్చ.. కుల్దీప్ దెబ్బ తర్వాత కూడా భారత్ ముందు భారీ టార్గెట్

పరిస్థితులు ఏవైనా సరే, మేము సిద్ధంగా ఉన్నాం: శ్రేయస్  

వాతావరణం ఎలా ఉన్నప్పటికీ, తాము ఒక ప్రొఫెషనల్స్ (Professionals) బృందం, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమయ్యామని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) స్పష్టం చేశారు. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. అవును, వర్షం పడే అవకాశం ఉంది.. అయితే దానిని మేము ఒక కారణంగా చూపలేం, ఇలాంటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. పరిస్థితి ఏదైనా సరే మేము మానసికంగా సిద్ధంగా ఉన్నాం, రేపటి మ్యాచ్‌లో వీలైనంత త్వరగా పరిస్థితులకు అలవాటు పడతామని పేర్కొన్నాడు.