తిరువనంతపురం (Thiruvananthapuram) వేదికగా భారత్ (Team India)తో జరుగుతున్న తొలి వన్డే (ODI) మ్యాచ్‌లో వెస్టిండీస్ (West Indies) జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగుల భారీ స్కోరు సాధించింది. విండీస్ ఓపెనర్ల అద్భుతమైన ఆటతీరుతో పాటు చివరి ఓవర్లో మిడిలార్డర్ బ్యాటర్ల దూకుడు కారణంగా కరేబియన్ జట్టు (Caribbean Team) టీమిండియా ముందు గట్టి సవాల్ విసిరింది.
