పుట్టిన బిడ్డకు బంగారు కానుక.. తమిళనాడులో సీఎం విజయ్ కొత్త పథకం ప్రారంభం

పుట్టిన బిడ్డకు బంగారు కానుక.. తమిళనాడులో సీఎం విజయ్ కొత్త పథకం ప్రారంభం
  • తమిళనాడులో మేనమామ బంగారు ఉంగరం పథకం షురూ
  • ప్రారంభించిన సీఎం విజయ్ 

తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే నవజాత శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరం అందించే సరికొత్త పథకం తాయ్‌మామన్ తంగ మోదిరం తిట్టం (మేనమామ బంగారు ఉంగరం పథకం) ప్రారంభించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకం పెంచడం , తల్లి-బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటం లక్స్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అర్హులైన ప్రతి నవజాత శిశువుకు 1 గ్రాము బరువుతో కూడిన 22 క్యారెట్ల బంగారు ఉంగరం అందజేస్తారు. దుర్వినియోగం కాకుండా ఉండటానికి ప్రతి ఉంగరానికి ఒక ప్రత్యేక సీరియల్ నంబర్‌ కేటాయించి, సీల్ చేసిన ప్యాకేజింగ్‌లో డిశ్చార్జ్ సమయంలో అందజేస్తారు. ఈ ఏడాది జూన్ 22 (సీఎం విజయ్ పుట్టినరోజు) తర్వాత జన్మించిన పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. 

రూ. 755 కోట్ల భారీ బడ్జెట్..

ఈ ప్రతిష్టాత్మక పథకం కోసం తమిళనాడు ప్రభుత్వం ఏటా రూ. 755.83 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. తొలి విడత పంపిణీ కోసం ఇప్పటికే 1.28 లక్షల బంగారు ఉంగరాలను సిద్ధం చేశారు. ప్రతీ ఉంగరానికి ఒక ప్రత్యేక సీరియల్ నంబర్ ఉంటుంది. ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ట్యాంపర్-ప్రూఫ్ ప్యాకేజింగ్‌లో వీటిని భద్రపరిచి పంపిణీ చేస్తారు.

అర్హతలు - నిబంధనలు :

  • లబ్ధి పొందే నవజాత శిశువుల తల్లులు తప్పనిసరిగా తమిళనాడు శాశ్వత నివాసులై ఉండాలి 
  • గర్భిణులు (PICME) లో నమోదై ఉండాలి 
  • అభ్యర్థులకు రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ ఐడీ తప్పనిసరి 

అక్టోబర్ 6న ఉపఎన్నికలు జరగనున్న మధురాంతకం, ధరాపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ పథకం అమల్లోకి వస్తుంది.

తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే నవజాత శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరం అందించే సరికొత్త పథకం తాయ్‌మామన్ తంగ మోదిరం తిట్టం (మేనమామ బంగారు ఉంగరం పథకం) ప్రారంభించారు.