కంటెంట్ ఉంటే చాలు చిన్న చిత్రాల ముందు స్టార్ హీరో సినిమాలు కూడా బోల్తా పడాల్సిందే . ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సృష్టిస్తున్న సంచలనాలు సినీ వర్గాలను సైతం ఆశ్చపరుస్తున్నాయి. కేవలం రూ. 2 కోట్ల అల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఆధ్యాత్మిక చిత్రం 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. నీమ్ కరోలీ బాబా దివ్య జీవితం, ఆయన బోధనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి రికార్డులను తిరగరాస్తోంది.
తగ్గని హవా..
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో, శోభినా సత్య ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం ఆగస్ట్ 7న చాలా సాధారణంగా థియేటర్లలోకి వచ్చింది. కానీ, ప్రేక్షకుల ఆదరణ పెరిగేకొద్దీ వసూళ్ల సునామీ మొదలైంది. ఏకంగా 52 రోజులు పూర్తయినా ఈ సినిమా హవా అస్సలు తగ్గలేదు. 52వ రోజే ఏకంగా రూ. 9 కోట్లు కొల్లగొట్టి.. కొత్తగా వచ్చిన సినిమాలకు కూడా షాక్ ఇస్తోంది.
రికార్డు కలెక్షన్స్ తో..
ప్రస్తుతం ఈ చిత్రం ఇండియా నెట్ కలెక్షన్లలో రూ. 307.03 కోట్లు (ఇండియా గ్రాస్ రూ. 362.70 కోట్లు) సాధించి, రూ. 300 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన 19వ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఓవర్సీస్‌లో రూ. 38.50 కోట్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 401.20 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రూ. 400 కోట్ల క్లబ్‌లో ఘనంగా చేరింది.
పెద్ద సినిమాలను దాటి..
ఈ క్రమంలోనే బాలీవుడ్ ఐకానిక్ హిట్ '3 ఈడియట్స్' పేరిట ఉన్న రూ. 202.47 కోట్ల కలెక్షన్లను చాలా సులువుగా దాటేసింది. అంతే కాదు రికార్డ్ హిట్ 'కాంతార' (రూ. 309.64 కోట్లు) కంటే కేవలం రూ. 2.61 కోట్లు మాత్రమే వెనుకబడి ఉంది. మరో ఒకటి, రెండు రోజుల్లో కాంతార రికార్డును కూడా దాటేసి ముందడుగు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.
విహాన్ హెగ్డే, చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ వంటి ప్రముఖులు నటించిన ఈ చిత్రాన్ని రాగిణి, నమ్రత, అనుప్రియ, విశాల్ చతుర్వేది సంయుక్తంగా నిర్మించారు. అద్భుతమైన కంటెంట్, భక్తి పారవశ్యం తోడైతే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఖాయమని 'హనుమాన్ అంశ్' మరోసారి నిరూపిస్తోంది. మున్ముందు ఇంకా ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
