జులైలో బ్యాంకు పనులు ముందే పూర్తి చేసుకోండి.. 12 రోజులు సెలవులు

జులైలో బ్యాంకు పనులు ముందే పూర్తి చేసుకోండి.. 12 రోజులు సెలవులు

ఈ ముచ్చట బ్యాంకు ఎంప్లాయిస్ కు కాస్త తీపి కబురు. అదే సందర్భంలో కస్టమర్లకు కాస్త ఇబ్బందికరమైన వార్త. ఎందుకంటే 2026 జులై నెలలో బ్యాంకులకు ఏకంగా 12 రోజుల సెలవులు ఉన్నాయి. దీంతో బ్యాంకు పనులు ఏమైనా ఉంటే ముందే కంప్లీట్ చేసుకోవడం బెటర్ అంటున్నారు. 

జులై నెలలో దేశ వ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు అంటే.. అటూ ఇటుగా రెండు వారాలు సెలవులు ఉండనున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

వీకెండ్ హాలిడేస్:

రెగ్యులర్ వీకెండ్స్ సెలవులు మొత్తం 6 రోజులు ఉన్నాయి. అవి:

ఆదివారాలు (సండే): జులై 5, జులై 12, జులై 19, జులై 26
రెండో శనివారం: జులై 11,
నాలుగో శనివారం: జులై 25

ప్రాంతీయంగా.. వివిధ రాష్ట్రాల్లో హాలిడేస్:

  • జులై 6 (సోమవారం): మిజోరంలో MHIP డే సందర్భంగా హాలిడే. దీని ప్రకారం.. ఈ రోజు మహిళలంతా సంఘటితం అవుతారు. 1974 నుంచి సెలవు ఇస్తున్నారు.
  • జులై 9 (గురువారం): మేఘాలయలో బెహ్ డెయింఖ్లామ్ పండుగ సందర్భంగా సెలవు. వర్షాకాలం పంటలు వేసే సందర్భంగా పండుగ నిర్వహిస్తారు. 
  • జులై 17 (గురువారం): ఒడిశా, ఉత్తరాఖండ్, మనిపూర్ రాష్ట్రాల్లో రథయాత్ర, కాంగ్, హరేలా పండుగల కారణంగా హాలిడే. 
  • జులై 17 (శుక్రవారం): స్వాతంత్ర్య సమరయోధుడు యు తిరోత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో సెలవు.
  • జులై 18 (శనివారం) : ద్రుక్పా త్షే–జి అనే బౌద్ధ పండుగ కారణంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు. ఈ రోజు బుద్ధుడు సారనాథ్ లో మొదటి జ్ఞాన బోధ చేసిన రోజుగా పండుగ జరుపుకుంటారు.
  • జులై 21 ( మంగళవారం): త్రిపురలో ఖార్చి పూజ సందర్భంగా బ్యాంకులకు సెలవు. 

ఈ రకంగా జులై నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న  బ్యాంకు ఉద్యోగులు హాలిడేస్ ను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది. అదే విధంగా కస్టమర్లకు సెలవులను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ ప్రకారం బ్యాంకు పనులు పూర్తి చేసుకోవడం బెటర్.  

►ALSO READ | TIMSలో 122 టెక్నికల్ పోస్టులు.. డిగ్రీ/ డిప్లొమా పాసైతే చాలు.. పూర్తి వివరాలు ఇవే..