దేవుడా.. స్నాక్స్లో బల్లి ఏంటి.. సిరిసిల్లలో స్వీట్ హౌస్లో షాకింగ్ ఘటన

దేవుడా.. స్నాక్స్లో బల్లి ఏంటి.. సిరిసిల్లలో స్వీట్ హౌస్లో షాకింగ్ ఘటన

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో స్వీట్ హౌస్లో షాకింగ్ ఘటన జరిగింది. బాలాజీ స్వీట్ హౌస్‌లో కొనుగోలు చేసిన స్నాక్స్‌లో బల్లి కనిపించిందని వినియోగదారుడు ఆరోపించాడు. యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా, దురుసుగా ప్రవర్తించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై సిరిసిల్ల పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్వీట్ హౌస్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఆఫీసర్లు ఫుడ్ సేఫ్టీని గాలికి వదిలేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడపాదడపా దాడులు చేసి చేతులు దులుపుకోవడం తప్ప.. ప్రజల ఆరోగ్యానికి హానీ కలిగించేలా ఫుడ్ తయారు చేస్తున్న హోటళ్లు, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

►ALSO READ | ఖమ్మం జిల్లాలో రూ. రెండున్నర కోట్ల గంజాయి బస్తాలు చూసి పోలీసులు షాక్

బేకరీలు, స్వీట్ హౌస్ల తయారీ స్థలాల్లోనూ కనీసం శుభ్రత పాటించడం లేదు. కేక్‌‌‌‌‌‌‌‌లు, స్వీట్ల తయారీలో కనీస ప్రమాణాలు పాటించడం లేదు. చాలా షాపుల్లో అమ్ముడుపోక గడువు తీరిన స్వీట్లు, కేక్‌‌‌‌‌‌‌‌లను రోజుల తరబడి నిల్వ చేసి అమ్మేస్తున్నారు. కేక్‌‌‌‌‌‌‌‌లకు వాడే స్పాంజ్‌‌‌‌‌‌‌‌ను బేకింగ్ చేసే ప్రక్రియలో బటర్ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బదులు న్యూస్ పేపర్ ను వాడుతున్నారు.

కేక్ తయారీలో వాడే ఫుడ్ కలర్స్‌‌‌‌‌‌‌‌లో గడువు తీరిన బాటిల్స్ వినియోగిస్తున్నారు. చాలా బేకరీల్లో కేక్స్ పైన తయారు చేసిన తేదీ, ఎక్స్ పైరీ తేదీకి సంబంధించిన లేబులింగ్ వేయడం లేదు.