స్టూడెంట్‌‌‌‌‌‌‌‌గా మారి.. పాఠాలు విన్న కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

స్టూడెంట్‌‌‌‌‌‌‌‌గా మారి.. పాఠాలు విన్న కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

ఎల్లారెడ్డిపేట, వెలుగు: నిత్యం -విధి నిర్వహణలో బిజీగా ఉండే రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌గా మారి పాఠాలు విన్నారు. సోమవారం ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌‌‌‌‌‌‌‌ను ఆమె తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఇంటర్ ఫస్టియర్ ఎకనామిక్స్ లెక్చరర్ పాఠం చెప్తుండగా కలెక్టర్ తరగతి గదిలోకి వెళ్లి స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి కూర్చొని విన్నారు. అనంతరం డైనింగ్ హాల్ కు వెళ్లి మెనూ పరిశీలించి సిద్ధం చేసిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. స్టూడెంట్స్ తో కలిసి భోజనం చేశారు.