గోదావరిఖని, వెలుగు: రామగుండం పట్టణంలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ప్లాంట్పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎంను కలిసి రామగుండంలో పలు అభివృద్ధి పనుల విషయమై ఎమ్మెల్యే విన్నవించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
తద్వారా అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెంది రామగుండం ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని వివరించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌ను అర్బన్ చాలెంజ్ ఫండ్ స్కీమ్‌లో చేర్చి ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. తన వినతిపై సీఎం సానుకూలంగా స్పందించారని, రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
