Sharmiela Engagement: నిర్మాతను పెళ్లి చేసుకోనున్న స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న ఎంగేజ్‌మెంట్ ఫొటోలు

Sharmiela Engagement: నిర్మాతను పెళ్లి చేసుకోనున్న స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న ఎంగేజ్‌మెంట్ ఫొటోలు

కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్మిలా మాండ్రే క్రేజీ అప్డేట్ పంచుకుంది. ప్రముఖ తమిళ నిర్మాత, పాషన్ స్టూడియోస్ వ్యవస్థాపకుడు సుధన్ సుందరంతో త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా తమ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు షేర్ చేస్తూ కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. తమిళ బ్లాక్ బాస్టర్  ‘మహారాజా’ తో పాటుగా నేషనల్ అవార్డు ఫిల్మ్ ‘పార్కింగ్’ సినిమాలను నిర్మించి నిర్మాతగా గుర్తింపు పొందారు సుధన్ సుందరం. అయితే ఈ జంట తమ పెళ్లి తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఇటీవల ఈ స్టార్ జోడీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థ వేడుకను జరుపుకుంది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన శర్మిలా, సుధన్ ఉంగరాలు మార్చుకుని తమ జీవిత ప్రయాణంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శర్మిలా మాండ్రే సినిమాలు..

నటిగానే కాకుండా నిర్మాతగా కూడా శర్మిలా సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. 2007లో విడుదలైన 'సజని' సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చి కృష్ణ, నవగ్రహ, ఆకే, గాలిపాట 2, ద డెవిల్ వంటి 35కి పైగా చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే సొంతంగా 'షర్మిలా మాండ్రే ప్రొడక్షన్స్' బ్యానర్ స్థాపించి పలు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించి సక్సెస్ అయింది. అయితే తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. 2013లో అల్లరి నరేశ్ హీరోగా చేసిన ‘కెవ్వు కేక’ మూవీలో హీరోయిన్గా నటించింది షర్మిల.

‘మహారాజా’తో సుధన్ గుర్తింపు..

నిర్మాత సుధన్ సుందరం ‘కప్పల్’, ‘సీతాకతి’, నేషనల్ అవార్డు ఫిల్మ్ ‘పార్కింగ్’, ‘మహారాజా’వంటి సినిమాలు నిర్మించి తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందారు. ఇక వీరి నిశ్చితార్థం పూర్తవడంతో వివాహ ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. పెళ్లి తేదీ, వేదికను ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఖరారు చేస్తున్నారని, ఇది ఓ అందమైన డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగనున్నట్లు వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. షర్మిలా కోరుకున్నట్టుగానే ఈ వివాహం కలల ప్రపంచంలా, క్లాసీగా, ప్రత్యేకంగా ఉండబోతుందనే సమాచారం.