జూన్ 30వ తేదీన రాహువు ధనిష్ఠ నక్షత్రంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు దొరుకుతాయి. ఇంకొందరిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతాయి. అయితే, ఎవరైనా సరే అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది. తుల రాశి నుండి మీన రాశి వరకు ఈ రాహు సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు చూద్దాం....
1. తులారాశి (ఆరోగ్యంపై శ్రద్ధ - ఆస్తి కలిసి వచ్చే కాలం)
రాహువు మీ రాశికి 5వ ఇంట్లో ఉంటాడు. ఈ సమయంలో కడుపుకు సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా కిడ్నీలు, లివర్ (కాలేయం) ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. కాకపోతే, ఆస్తులు కొనడానికి, సంపద పెంచుకోవడానికి ఈ సమయం చాలా బాగుంది.
చేయాల్సిన పరిహారం: మీ పిల్లలపై అనవసరంగా కోప్పడకండి లేదంటే వారితో మీ బంధం దెబ్బతింటుంది.
2. వృశ్చిక రాశి (ఇంట్లో అశాంతి - ప్రయాణాల్లో జాగ్రత్త)
రాహువు మీ రాశికి 4వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల ఇంట్లో ఏదో ఒక గొడవ లేదా అశాంతి ఉండే అవకాశం ఉంది. పాత విషయాలను ఆలోచిస్తూ ఉండటం వల్ల రాత్రి పూట నిద్ర సరిగా పట్టకపోవచ్చు. బండి నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి గోడలకు అకస్మాత్తుగా పగుళ్లు రావడం లేదా ఇంట్లో వస్తువులు మాయమవ్వడం లాంటివి జరగవచ్చు.
చేయాల్సిన పరిహారం: రాత్రి పడుకునేటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
3. ధనుస్సు రాశి (పెరగనున్న ధైర్యం - ప్రతిష్టపై నిఘా)
రాహువు మీ రాశికి పరాక్రమ స్థానం (ధైర్యాన్ని ఇచ్చే ఇల్లు) లో ఉంటాడు. దీనివల్ల మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతాయి. ఎంత కష్టమైన పనైనా ఈజీగా పూర్తి చేస్తారు. అయితే, మీ ప్రవర్తన వల్ల సమాజంలో మిమ్మల్ని గొడవకోరు మనిషిగా అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మీ పేరు పాడవకుండా చూసుకోండి.
చేయాల్సిన పరిహారం: మీ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లతో ఇంకా మీ జీవిత భాగస్వామి (భార్య/భర్త) తో మంచి సంబంధాన్ని కొనసాగించండి.
4. మకర రాశి (డబ్బు దాచుకునే ప్రవృత్తి - మాట తీరు మార్చుకోవాలి)
రాహువు మీ రాశికి ధనం, కుటుంబం, వాక్కు (మాట) స్థానంలో ఉంటాడు. దీనివల్ల మీ సంపదను, బంగారం, వెండిని ఇతరులకు తెలియకుండా రహస్యంగా దాచుకోవాలనే ఆలోచన పెరుగుతుంది. కుటుంబ సభ్యులపై మీ అథారిటీ చూపించాలని చూస్తారు. ముఖం, కళ్ళు, ముక్కు లేదా చెవులకు గాయాలు అవ్వడం లేదా సర్జరీ జరగడం లాంటివి అయ్యే ఛాన్స్ ఉంది.
►ALSO READ | మీకు తెలుసా ఈ రహస్యం : ఇండియాలోనే మోస్ట్ హ్యాంటెడ్ ప్లేస్.. చీకటి పడితే అంతే.. ఆ కోట తలుపులు మూసేస్తారు !
చేయాల్సిన పరిహారం: ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరుపై, భాషపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.
5. కుంభ రాశి (వ్యక్తిత్వంలో మార్పులు - పోలీసు ఉద్యోగులకు బిజీ)
రాహువు మీ లగ్న రాశిలోనే ఉంటాడు. దీనివల్ల మీ లుక్, జుట్టు, మీ పర్సనాలిటీలో చాలా మార్పులు వస్తాయి. పోలీస్ శాఖలో లేదా దేశ రక్షణ రంగంలో పనిచేసే వారికి ఈ సమయంలో పని ఒత్తిడి, బిజీ ఎక్కువగా ఉంటుంది.
చేయాల్సిన పరిహారం: మీకు ఆటలు ఆడటం లేదా ఎక్సర్‌సైజులు చేసే అలవాటు ఉంటే, మీ శక్తికి మించి కష్టపడకండి లేదంటే గాయాలు కావచ్చు.
6. మీన రాశి (ఖర్చులు పెరుగుతాయి - కోర్టు కేసుల ముప్పు)
రాహువు మీ రాశికి 12వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల అనవసరమైన ఖర్చులు బాగా పెరుగుతాయి. ఎవరితోనూ వాదనలకు దిగకండి, లేదంటే లీగల్ సమస్యలు లేదా కోర్టు కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. విదేశాలకు వెళ్లాలనే ఆశతో తెలియని బ్రోకర్లను నమ్మి మోసపోకండి డబ్బు నష్టపోయే ఛాన్స్ ఉంది.
చేయాల్సిన పరిహారం: ఇంట్లోనే రోజూ దేవుడిని పూజించుకోండి. ఈ సమయంలో దూర ప్రాంతాల తీర్థయాత్రలకు వెళ్లకపోవడం మంచిది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
