మీకు తెలుసా ఈ రహస్యం : ఇండియాలోనే మోస్ట్ హ్యాంటెడ్ ప్లేస్.. చీకటి పడితే అంతే.. ఆ కోట తలుపులు మూసేస్తారు !

మీకు తెలుసా ఈ రహస్యం : ఇండియాలోనే మోస్ట్ హ్యాంటెడ్ ప్లేస్.. చీకటి పడితే అంతే.. ఆ కోట తలుపులు మూసేస్తారు !

ఒకే ప్రదేశం అటు చూడటానికి ఎంతో అందంగానూ.. ఇటు ఒళ్లు జలదరించేలా భయానకంగానూ ఉండటం సాధ్యమేనా ? అంటే.. ఉంది అనే సమాధానం ఇస్తుంది రాజస్థాన్‌లోని 'భాన్‌గఢ్ కోట' (Bhangarh Fort). ఆరావళి కొండల మధ్య ఉండే ఈ కోటను భారతదేశంలోనే అత్యంత భయంకరమైన దెయ్యాల కోటగా చెప్తారు.

జైపూర్-అల్వార్ మధ్యలో, సరిస్కా నేషనల్ పార్క్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్లేస్.. టూరిస్టులకు ఒక కిక్కెక్కించే ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడి దెయ్యాల కథలు భయపెట్టినా, అక్కడి అద్భుతమైన హిస్టరీ, ప్రకృతి అందాలు మాత్రం జనాన్ని మళ్లీ మళ్లీ రమ్మని పిలుస్తుంటాయి.

మనవడి కోసం 
ఈ కోటను 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో కీలకమైన రాజపుత్ర రాజు 'మాన్ సింగ్ I' కట్టించారు. తన మనవడైన 'మాధో సింగ్ I' నివాసం కోసం ఈ కోటను నిర్మించారు.

ఈ రోజుకీ ఈ కోట లోపలి కట్టడాలు ఆనాటి వైభవాన్ని గుర్తుచేస్తాయి. లాహోరీ గేట్, అజ్మేరీ గేట్, ఫుల్బారీ గేట్, ఢిల్లీ గేట్ అని దీనికి నాలుగు మెయిన్ ఎంట్రెన్స్ లు ఉంటాయి. లోపలికి వెళ్లగానే ఎత్తైన గుడులు, పాతకాలపు బిల్డింగులు, రాజభవనాలు మనకు కనిపిస్తాయి. ఆ కాలం నాటి శిల్పకళను చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే!

భయం మధ్యలో ప్రశాంతత
ఈ కోట ప్రాంగణాల్లో, చిక్కుముడి లాంటి సందుల్లో నడుస్తుంటే తెలియని ఒక వింత అనుభూతి కలుగుతుంది. పాత గోడల మధ్య ఎండ-నీడల ఆట, అక్కడ ఉండే నిశ్శబ్దం చూస్తే.. అప్పట్లో ఈ కోట ఎంత కలకలలాడిందో.. ఇప్పుడు ఇలా టైమ్ స్తంభించిపోయినట్లు మారిపోయింది ఏంటి ? అని అనిపిస్తుంది.

అయితే, ఈ భయంకరమైన వాతావరణం మధ్యలో ఒక ప్రశాంతమైన చోటు ఉంది. అదే 'సోమేశ్వర మహాదేవ ఆలయం' (శివుడి గుడి). స్థానిక ప్రజలు ఈ దేవుణ్ణి చాలా పవిత్రంగా నమ్ముతారు. ఈ గుడి పైనుంచి చూస్తే చుట్టుపక్కల ఉండే రాజస్థాన్ ఎడారి కొండల వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది.

ఎలా పాడైపోయింది? ఆ శాపం ఏంటి?
అంతలా జనంతో కిటకిటలాడిన కోట.. ఉన్నట్టుండి ఇలా శ్మశానంలా ఎందుకు మారింది,,? దీని వెనుక ఒక భయంకరమైన శాపం ఉందని ప్రచారంలో ఉంది.

ALSO READ : పిల్లల స్నాక్స్ : అయ్యంగార్ శాండ్ విచ్, అటుకుల పకోడా, ఉల్లిపాయ రోల్స్.. పిల్లలకు ఇంట్లోనే తయారు చేసుకోండి..!

 మంత్రగాడి కథ:
ఆ కోటలో రత్నావతి అనే ఒక అందమైన యువరాణి ఉండేది. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఒక చేతబడి (బ్లాక్ మ్యాజిక్) తెలిసిన మంత్రగాడు ప్లాన్ చేశాడు. ఒకరోజు యువరాణి మార్కెట్లో ఉన్నప్పుడు, ఆమెను వశపరుచుకోవడానికి ఒక 'ప్రేమ మందు' (మాయా ద్రవం) ఇచ్చాడు. కానీ, స్మార్ట్ అయిన యువరాణి దాన్ని కనిపెట్టి, ఆ మందు సీసాని పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిపై విసిరికొట్టింది.

దాంతో ఆ మంత్రం రివర్స్ అయ్యి.. ఆ బండరాయి దొర్లుకుంటూ వచ్చి నేరుగా ఆ మంత్రగాడి మీదే పడి అతన్ని నలిపేసింది. వాడు చనిపోతూ.. "ఈ కోట సర్వనాశనం అయిపోవాలి, ఇందులో ఎవరూ బ్రతకకూడదు" అని ఆ గ్రామం మొత్తాన్ని శపించాడట. ఆ తర్వాత జరిగిన యుద్ధాల్లో కోట మొత్తం నాశనమైంది.

సూర్యాస్తమయంతో మారిపోయే ప్రపంచం
సాయంత్రం అయ్యి చీకటి పడగానే.. ఆ యుద్ధాల్లో చనిపోయిన వారి ఆత్మలు ఈ కోటలో తిరుగుతాయని స్థానికులు గట్టిగా నమ్ముతారు. అందుకే, సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత ఈ కోటలోకి ఎవరినీ అడుగుపెట్టనివ్వరు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కూడా దీనికి సంబంధించి బోర్డులు పెట్టింది. రాత్రిపూట అక్కడ వింత వింత శబ్దాలు విన్నామని ఇప్పటికీ చాలామంది చెబుతుంటారు.

భాన్‌గఢ్ వెళ్లడం అంటే కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ కి వెళ్లడం కాదు.. ఒక మిస్టరీ ప్రపంచంలోకి అడుగుపెట్టడం. మీకు హిస్టరీతో పాటు కాస్త అడ్వెంచర్, థ్రిల్ కావాలనుకుంటే.. ఈ పురాతన కోట మీకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.