తెలంగాణలో కొత్తగా 5 ఈ టెక్నో స్కూల్స్ ప్రారంభించిన నారాయణ స్కూల్స్

తెలంగాణలో కొత్తగా 5 ఈ టెక్నో స్కూల్స్ ప్రారంభించిన నారాయణ స్కూల్స్

తెలుగు రాష్ట్రాల్లో విద్యా రంగంలో అగ్రగామిగా ఉన్న నారాయణ స్కూల్స్ తన ప్రస్థానాన్ని మరింత విస్తరిస్తున్నాయి. 1985లో స్థాపించబడి నాణ్యమైన విద్యను అందిస్తున్న నారాయణ సంస్థలు, తెలంగాణలో విద్యార్థులకు మరింత చేరువయ్యేందుకు మరో ఐదు కొత్త స్కూల్ క్యాంపస్‌లను ప్రారంభించాయి. ఇందులో నాలుగు హైదరాబాద్‌లో కాగా, మరో క్యాంపస్ నిజామాబాద్‌లో అందుబాటులోకి వచ్చాయి.

నారాయణ స్కూల్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌లో ప్రారంభమైన కొత్త క్యాంపస్‌లో విద్యార్థుల సౌకర్యం కోసం హాస్టల్ వసతితో పాటు సీబీఎస్ఈ (CBSE) కరిక్యులమ్‌ను అందిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నాలుగు కొత్త క్యాంపస్‌లలో స్టేట్ బోర్డ్ సిలబస్ ప్రకారం బోధన కొనసాగనుంది. ఈ నూతన క్యాంపస్‌లన్నింటిలోనూ అత్యాధునిక డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలు, వయస్సుకు తగిన బోధనా పద్ధతులను అమలు చేస్తున్నారు. కేవలం మార్కుల సాధనే కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, సంపూర్ణ వికాసంపై ఈ విద్యా సంస్థలు ప్రత్యేక దృష్టి సారించనున్నాయి.

ఈ తాజా విస్తరణతో తెలంగాణలో నారాయణ పాఠశాలల సంఖ్య ఏకంగా 120కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా చూస్తే నారాయణ విద్యాసంస్థల నెట్‌వర్క్ 574 క్యాంపస్‌లకు విస్తరించి, అగ్రగామి విద్యా సంస్థగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. విద్యార్థులకు ఉత్తమమైన ప్రమాణాలు, ఆధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని నారాయణ యాజమాన్యం స్పష్టం చేసింది.