మకుటం సినిమాతో ఆ కోరిక నెరవేరింది: విశాల్

మకుటం సినిమాతో ఆ కోరిక నెరవేరింది: విశాల్

విశాల్ హీరోగా, దర్శకుడిగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌పై రూపొందిస్తున్న చిత్రం ‘మకుటం’. అంజలి, దుషార విజయన్ హీరోయిన్స్‌‌.  తాజాగా ఈ చిత్రం నుంచి ‘నచ్చాకే వచ్చేరా’ అంటూ సాగే  సెకండ్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌లో  విశాల్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంతో దర్శకుడిగా ఆడియెన్స్ ముందుకు రావడం ఆనందంగా ఉంది. ‘శివ’ చూసిన తర్వాత  డైరెక్టర్ అవ్వాలనుకున్నా. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది. 

ఆర్‌‌బీ చౌదరి గారిని మిస్ అవుతున్నా. 99వ ప్రాజెక్ట్‌‌ బాధ్యతల్ని ఆయన నాకు ఇచ్చారు. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నా.   ఆయన బ్యానర్ నుంచి పరిచయం అయిన దర్శకుల్లో  నేను 45వ వ్యక్తిని.  ఈ సినిమా కోసం నా బెస్ట్ ఇచ్చాను. 

ప్రేక్షకులకు   ఓ మంచి సినిమాటిక్ ఎక్స్‌‌పీరియెన్స్ ఇస్తాను’ అని అన్నాడు. ఈ చిత్రంలో తన పాత్ర పవర్‌‌‌‌ఫుల్‌‌గా ఉంటుందని అంజలి చెప్పింది. ఆర్‌‌‌‌బీ చౌదరి లెగసీని కొడుకులుగా తాము కంటిన్యూ చేస్తామని జితిన్ రమేష్​ అన్నారు.  నటుడు అజయ్, నటి ఝాన్సీ, సింగర్ ప్రభ పాల్గొన్నారు.