కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) మీద చాలా అనుమానాలున్నాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇతర దేశాల వాళ్లకు మన దేశంలో ఓట్లు ఉండొద్దనడం మంచిదేనని, మరి ఇతర రాష్ట్రాల వాళ్లు ఒక్కొక్కరూ రెండు మూడు రాష్ట్రాల్లో ఓటు వేయొచ్చా అని ప్రశ్నించారు. ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్ల ఏరివేతకు ఈసీ వద్ద ఉన్న మెకానిజం ఏంటో చెప్పాలన్నారు. ఈ డూప్లికేషన్ ఓట్లను కంట్రోల్ చేయకపోతే ఎస్ఐఆర్ తో ఎలాంటి యూజ్ లేదన్నారు. సోమవారం బంజారాహిల్స్ లోని పార్టీ ఆఫీస్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రాసెస్‌లో భాగంగా తన నియోజకవర్గమైన బోధన్‌లో ఏడు వేల ఓట్లను తొలగించిన విషయం తెలిసిందని కవిత చెప్పారు.
అసలు ఎస్ఐఆర్ ప్రాసెస్‌కు ప్రయోజనం ఉండాలంటే మెయిన్‌గా ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను తొలగించాలని కవిత చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మన దేశంలో ఇతర దేశస్తులకు ఓట్లు ఉండవద్దని చెబుతున్నారని, దాన్ని తాము వెల్‌కమ్ చేస్తున్నామన్నారు. కానీ ఒక పర్సన్‌కు రెండు మూడు రాష్ట్రాల్లో ఓటు ఉండవచ్చా అని ప్రశ్నించారు.
ALSO READ : రెండు ఓట్లు ఉన్నవాళ్లు ఒక చోట రద్దు చేసుకోవాల్సిందే..లేకపోతే రెండు పోతయ్
ప్రకాశ్ రాజ్ లాంటి యాక్టర్‌కు రెండు మూడు స్టేట్ లలో ఓటు హక్కు ఉంటే వాటిని తొలగించేందుకు ఏడేళ్లు పట్టిందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల ఓట్లను తొలగించకపోతే ఇతర దేశస్తులు ఒక రాష్ట్రంలో సర్జరుగుతుంటే మరో రాష్ట్రంలో వాళ్ల ఓట్లను నమోదు చేసుకోరా అని ప్రశ్నించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓట్ అనే విధానం ఉండాలని డిమాండ్ చేశారు. సర్ కోసం సాధారణంగా ఈ ఏడాది జనవరి 1 నుంచి రిఫరెన్స్ పాయింట్ తీసుకోవాల్సి ఉండగా ఈసీ మాత్రం గతేడాది జనవరి 1 నుంచి రిఫరెన్స్ పాయింట్ తీసుకుందని అన్నారు.
