ఆరోగ్య జ్యోతిష్యం: జాతకంలో గురుడు బలహీనంగా ఉంటే..ఎంత తిన్నా నీరసమే.!

ఆరోగ్య జ్యోతిష్యం:   జాతకంలో గురుడు బలహీనంగా ఉంటే..ఎంత తిన్నా నీరసమే.!

 జ్యోతిష్య శాస్త్రాన్ని  గురు గ్రహాన్ని శుభ గ్రహం అంటారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం గురుడు జీవితాన్ని.. ప్రాణశక్తిని ఇస్తాడు.  అందుకే జీవకారకుడు అని కూడా అంటారు. వ్యక్తిగత జాతకం ప్రకారం లగ్నాధిపతిపై గురుడు శుభ దృష్టి ఉంటే  శరీరం.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతాడు.  ఆ వ్యక్తికి అద్భుతమైన రోగ శక్తితో పాటు దీర్ఘాయుష్షు కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 

గురుడు జీవుల స్థూల శరీరాన్ని.. బాహ్య జీవితంతో పాటు శారీరక నిర్మాణాన్నా సూచిస్తాడు.  గ్రహాల అంతర్గత బలం ప్రకారం  ఫలితాలను ఇచ్చే విషయంలో కీలక పాత్ర పోషిస్తాడు.  ముఖ్యంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎలాంటి ఫలితాలు ఇవ్వాలో నిర్దేశిస్తాడు. 

గురుడు ఆరోగ్య విషయంలో కీలక పాత్రపోషిస్తాడు. గురుడి సొంత రాశులైన  ధనస్సు.. మీనరాశులలో  .. తనకు ఇష్టమైన కర్కాటక రాశిలో ఉన్నా... బుధుడు.. శుక్రుడు.. చంద్రుడు వంటి శుభ గ్రహాలతో గురుడు కలిసినప్పుడు శక్తివంతంగా ఉంటాడని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. 

జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం వ్యక్తిగత జాతకంలో గురుడు బలంగా ఉన్నా.. శుభ దృష్టి కలిగి ఉన్నా.. అలాంటి వారికి ​అద్భుతమైన రోగనిరోధక శక్తి ఉంటుంది.  అలాంటి వారి శరీరంపై ఏవైనా వైరస్​ లు  లేదా బ్యాక్టీరియా దాడి చేసినప్పుడు శరీరం త్వరగా కోలుకుంటుంది. గురు శక్తితో ఇలాంటి వారి జీవనశక్తి పెరుగుతుంది. వీరు ఎప్పుడూ ఉత్సాహంగా, ఆశాజనక దృక్పథంతో ఉంటారు. అంతేకాదు  మానసిక ప్రశాంతత వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

ఆరోగ్య విషయంలో జీర్ణక్రియ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి శక్తి కావాలంటే.. ఆహారం తీసుకోవాలి.  జీర్ణక్రియ సరిగ్గా ఉంటేనే ఆకలి వేయడం.. తిన్న ఆహారం ఒంటపట్టడం.. కాలేయం సరిగ్గా పని చేయడం  మొదలైనవి  ఉంటాయి. వీటన్నింటికి గురుడు కీలకపాత్ర పోషిస్తాడు.   జాతకంలో గురుడు 1, 4, 7, 10 ఇళ్లలో  బలంగా ఉంటే, ఇతర పాప గ్రహాలు కలిగించే ఎన్నో అనారోగ్య దోషాలను గురుడు తన శుభ దృష్టితో తుడిచిపెట్టేస్తాడని పండితులు చెబుతున్నారు.

గురుడు బలహీనంగా ఉన్నవారు సాధారణంగా కఫము.. శ్వాశసకోస సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆయనకు శత్రు స్థానాలైన మకర, వృషభ, తులా రాశుల్లో గురుడి సంచారం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అధింగా బరువు పెరగడం.. శరీరంలో కొవ్వు పేరుకు పోవడం..  కణజాలాలలో నీరు చేరడం వంటివి జరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పుతాయి. అందుకే బ్లడ్​ షుగర్​ ఒక్కోసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది.   కాలేయ పనితీరు బలహీనపడి ఫ్యాటీ లివర్ మరియు కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయి.

గురుడు బలహీనంగా ఉండి.. పాప గ్రహాలైన  శని, రాహువు, కేతువు , కుజుడుతో కలిసినప్పుడు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల చివరికి ఇది గుండెపై గురు గ్రహం ప్రభావం చూపిస్తుంది. వాత సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. 

ఇతర సమస్యలు

  • శరీరం శుష్కించిపోవడం
  • ఎంత తిన్నా లావు అవ్వకపోగా..రోజురోజుకూ బక్కచిక్కిపోవడం
  • ​తీవ్రమైన నీరసం, వణుకు 
  • నిరంతరం అలసటగా, శక్తి లేనట్టుగా ఉండటం
  • ​నరాల బలహీనత, కాళ్లు-చేతులు లాగడం
  •  ఆయాసం (శ్వాస ఆడకపోవడం) వంటి సమస్యలు 
  • ​హార్మోన్ల అసమతుల్యత
  • థైరాయిడ్, అడ్రినల్ గ్రంథుల పనితీరు దెబ్బతినడం

జాతకంలో గురుడు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోవడం ఆరోగ్య పరంగా ఎంతో ముఖ్యమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.   ఏ గ్రహాల దృష్టి  ఎలా ఉంది అనే అంశాలను  జ్యోతిష్యుల ద్వారా తెలుసుకొని .. దానికి తగినవిధంగా ఆహార నియమాలతో పాటు ఆస్ట్రాలజీ  పరిహారాలు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పండితులు చెబుతున్నారు. 


Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.