డెలివరీ బాయ్తో ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో లొల్లి.. వీడియో వైరల్ !

డెలివరీ బాయ్తో ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో లొల్లి.. వీడియో వైరల్ !

ఫుడ్ డెలివరీ బాయ్తో ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ గొడవ పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్డర్ చేసిన ఫుడ్ బదులు డెలివరీ బాయ్ రాంగ్ ఆర్డర్ ఇవ్వడంతో ఈ గొడవ జరిగినట్లు వీడియో చూస్తే స్పష్టమైంది. రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకు తాను క్షమాపణ చెప్పినా హీరో తల్లి తనపై ఉమ్మేసిందని డెలివరీ బాయ్ మాట్లాడుతున్న మాటలు వీడియోలో రికార్డ్ కావడం గమనార్హం.

డెలివరీ బాయ్ మీదకు అఖిల్ వెళుతుంటే అతని తండ్రి అడ్డుకుంటున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి. అఖిల్ రాజ్ ఈ వీడియోలో సదరు డెలివరీ బాయ్పై కోపంతో ఊగిపోతూ కనిపించాడు. వీడియో చివరిలో రికార్డ్ చేసిన వీడియోను డిలీట్ చేయాలని అఖిల్ అడిగినట్లు స్పష్టంగా వినిపించింది. వీడియో చూస్తే.. అఖిల్ రాజ్ తన కుటుంబంతో కలిసి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉంటున్నాడని అర్థమైంది. 

►ALSO READ | హైదరాబాద్ సిటీలో నకిలీ గోల్డ్ ఫ్లాక్ సిగరెట్లు : ధూమపాన ప్రియులను మోసం చేస్తున్న పాన్ షాపులు

'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రంతో గుర్తింపును తెచ్చుకున్న అఖిల్ రాజ్ హీరోగా మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. 'అర్జునుడి గీతోపదేశం' టైటిల్తో సతీష్ గోగాడ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

ఫస్ట్ కట్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్పై త్రిలోక్ నాథ్ కాళిశెట్టి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్, రాజమండ్రి, అమలాపురం పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. దివిజ ప్రభాకర్, ఆదిత్య శశికుమార్, సదన్, వసంతిక మచ్చ, రాజీవ్ సాలూర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నాడు.