తెలంగాణ పోలీసు శాఖ భారీ ఎత్తున ప్రమోషన్లు చేపట్టింది. 36 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించింది. పదోన్నతి అనంతరం పోస్టింగ్‌లు కూడా ఇస్తూ సోమవారం (జూన్ 29) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, యూనిట్లలో నూతన డీఎస్పీల నియామకం చేపడుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారులనుడీజీపీ సి.వి. ఆనంద్ అభినందించారు. పదోన్నతి అంటే హోదా మాత్రమే కాదు.. ప్రమోషన్ తో బాధ్యత కూడా పెరుగుతుందని చెప్పారు. నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలని అధికారులకు సూచన చేశారు.
ప్రజల సమస్యలను పారదర్శకంగా, చట్టబద్ధంగా పరిష్కరించాలని సూచించారు. శాంతిభద్రతలు, నేర నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సమర్థవంతమైన నాయకత్వం ప్రదర్శించాలని డీజీపీ పిలుపునిచ్చారు.
ఈ ప్రమోషన్లలో డీఎస్పీలుగా నియామకం అయిన అధికారులు.. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాలు కాకుండా ఇతర విభాగాల్లో సేవలందించనున్నారు.
