సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. ACP ఆఫీసులో లొంగిపోయిన ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. ACP ఆఫీసులో లొంగిపోయిన ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సోమవారం కీలక పరిణామం జరిగింది. ఈ లాకప్ డెత్లో మాజీ సీఐ నాగరాజుకు సహకరించిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని సూర్యారావుపేట ఏసీపీ ఆఫీసులో సోమవారం సాయంత్రం లొంగిపోయారు.

ఈ కేసులో మాజీ సీఐ నాగరాజుతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. సాయికృష్ణ కేసులో హెబియల్ కార్పస్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. జులై 15కు కోర్టు వాయిదా వేసింది. సీబీఐతో విచారణ జరిపించాలన్న పిటిషన్ పైనా విచారణను కోర్టు జులై 15కు వాయిదా వేసింది.

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నానిలను సిట్ నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిందితులపై కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. ఇప్పటికే ఈ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నానిలను విజయవాడ సీపీ సస్పెండ్ చేశారు. సాయి కృష్ణ డెడ్ బాడీ మిస్ చేసిన ఉదంతంలో అశోక్, నాని కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

►ALSO READ | సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో బిగ్ ట్విస్ట్: ఇద్దరు కానిస్టేబుళ్లను నిందితులుగా చేర్చిన సిట్

సాయికృష్ణ కేసు రిమాండ్ రిపోర్టులో కొన్ని కీలక విషయాలను సిట్ బయటపెట్టింది. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారని రిమాండ్ రిపోర్టులో సిట్ నిర్ధారించింది. మృతదేహాన్ని కూడా మాయం చేశారని పేర్కొంది. సాయికృష్ణ మృతదేహాన్ని కృష్ణలంక పీఎస్లో చూశానని ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ను డీవీఆర్లో లేకుండా చేశారని.. సాయికృష్ణ మృతి చెందాడని తెలిసినా కృష్ణలంక పీఎస్ సిబ్బంది మేజిస్ట్రేట్కు సమాచారం ఇవ్వలేదని సిట్ బయటపెట్టింది.

సాయికృష్ణ తల్లిని మాజీ సీఐ నాగరాజు దూషించాడని.. సాక్ష్యాలను నాశనం చేయడానికి నాగరాజే కారణమని సిట్ స్పష్టం చేసింది. మే 8న సాయికృష్ణను మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ కోర్టులో హాజరు పరచలేదు. పోలీసుల తీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుందని సిట్ ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.