ఆంధ్రప్రదేశ్లో తీవ్ర దుమారం రేపుతోన్న సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కానిస్టేబుళ్లు అశోక్, నానిలను నిందితులుగా చేర్చింది సిట్. ఈ మేరకు నిందితులపై కోర్టులో మెమో దాఖలు చేసింది సిట్. మరోవైపు కానిస్టేబుళ్లు అశోక్, నానిలను విజయవాడ సీపీ సస్పెండ్ చేశారు.
కాగా, సాయి కృష్ణ డెడ్ బాడీ మాయంలో కానిస్టేబుళ్లు అశోక్, నాని కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరిని కేసులో నిందితులుగా చేర్చారు పోలీసులు. కానిస్టేబుళ్లు అశోక్, నాని ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కాగా, ఈ కేసులో ఇప్పటికే కృష్ణలంక సీఐని సిట్ అరెస్ట్ చేసిన విసయం తెలిసిందే.
►ALSO READ | విజయవాడ, హైదరాబాద్ NH-65 హైవేపై ఘోరం.. మూడు కార్లు నుజ్జునుజ్జు.. ఐదుగురి పరిస్థితి విషమం
ఏపీలో విజయవాడకు చెందిన గాదె సాయి కృష్ణ అనే యువకుడి మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. జూన్ 29వ తేదీలోపు హాజరుపరచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. గాదె సాయి కృష్ణను పోలీసులు కొట్టి చంపారని.. సాయికృష్ణ డెడ్ బాడీని కృష్ణలంక శ్మశాన వాటికలో కాల్చేశారని.. ఆధారాలు లేకుండా చేశారని.. బూడిద కూడా ఆ కుటుంబానికి ఇవ్వకుండా చేశారని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
