హైదరాబాద్: విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్ పల్లి టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు వెళుతున్న కారు డివైడర్ను ఢీ కొట్టి బోల్తా పడటంతో.. హైదరాబాద్ వైపు వెళుతున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు నుజ్జునుజ్జయ్యాయి.
కార్లలో ఉన్న సుమారు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు అంతా విజయవాడకు చెందిన వాళ్ళుగా పోలీసులు గుర్తించారు. భారీగా నిలిచిపోయిన వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు.
* నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 65పై రోడ్డు ప్రమాదం
* విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న రహదారిలో ఒక దానికి ఒకటి ఢీకొన్న మూడు కార్లు, ఒక బైకు
* మూడు కార్లల్లో మొత్తం పది మంది ప్రయాణికులు.. నలుగురికి తీవ్ర గాయాలు
* సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్న కార్లు.. రోడ్డుపై అడ్డంగా పడిన కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్
* ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేసిన పోలీసులు
