యాదాద్రి ఆలయ ధర్మకర్త మండలి కీలక సమావేశం

యాదాద్రి ఆలయ ధర్మకర్త మండలి కీలక  సమావేశం

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి పుణ్యక్షేత్రంలో ఆలయ ధర్మకర్త మండలి సమావేశమైంది.  ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు,భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించనున్నారు.

ఆలయ ధర్మకర్త మండలి ఛైర్మన్ మన్నే సత్యనారాయణ రెడ్డి   అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ధర్మకర్త మండలి సభ్యులు వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిప్పలగారి విజయరాజం, తూళ్ళ విజయేందర్ గౌడ్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, ఎం. రాఘవేందర్ రావు,  లక్ష్మీ నరసింహ నాయక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని పలు కీలక విషయాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి ఎక్స్ అఫిషియో సభ్యులుగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, వైటీడీఏ (YTDA) వైస్ ఛైర్మన్ కిషన్ రావు, అలాగే ఆలయ ఈఓ భవాని శంకర్ హాజరై ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు.

►ALSO READ | ఆధ్యాత్మికం : శ్రావణ మాసం ఈ నెలలో వచ్చే పండగలు.. సెలవులు ఇవే..!