పోక్సో కేసులో దోషికి 25 ఏండ్లు జైలు శిక్ష.. 2020లో మిర్యాలగూడ పోలీసులు కేసు నమోదు

పోక్సో కేసులో దోషికి 25 ఏండ్లు జైలు శిక్ష.. 2020లో మిర్యాలగూడ పోలీసులు కేసు నమోదు

మిర్యాలగూడ, వెలుగు:  బాలికను అపహరించి లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి నల్గొండ ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ట్రాక్ కోర్టు 25 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.7 వేల జరిమానా విధించినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన మహమ్మద్ జాఖీర్ బాబా మిర్యాలగూడకు చెందిన బాలికను అపహరించి, ఆపై అత్యాచారం చేసినందుకు 2020లో పోక్సో కింద మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి ఈ మేరకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.