స్టాక్ మార్కెట్‌లో లాభాల పంట.. ఎగబాకిన సెన్సెక్స్, నిఫ్టీ ! ఒక్కరోజే లక్షల కోట్లు సంపాదించిన ఇన్వెస్టర్లు..

 స్టాక్ మార్కెట్‌లో లాభాల పంట.. ఎగబాకిన సెన్సెక్స్, నిఫ్టీ ! ఒక్కరోజే లక్షల కోట్లు సంపాదించిన ఇన్వెస్టర్లు..

దాదాపు ఎనిమిది వారాల తర్వాత, ఈ వారం మొదటి రోజున(5 అక్టోబర్) దలాల్ స్ట్రీట్‌లో బుల్లిష్ సెంటిమెంట్ తిరిగి వచ్చింది. స్టాక్ మార్కెట్ పతనంతో సతమతమవుతున్న పెట్టుబడిదారులకు ఈరోజు గొప్ప రిలీఫ్ లభించింది. ఈయర్జు స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి  సెన్సెక్స్ 472.77 పాయింట్లు (0.66%) పెరిగి 72,382.47 వద్ద లాభాలతో ముగిసింది.  నిఫ్టీ 133.80 పాయింట్లు పెరిగి (0.60%) 22,555.75 వద్ద ముగిసింది.

దింతో సెన్సెక్స్ స్టాక్‌లలో 20 పెరగగా, 10 పడిపోయాయి. వీటిలో, ఐటీసీ షేర్లు అత్యధికంగా 4.49% లాభపడగా, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 3.69% పడిపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగియడంతో పెట్టుబడిదారుల సంపద రూ.1.06 లక్షల కోట్లు పెరిగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, స్మాల్‌క్యాప్ 100 సూచీలు కూడా లాభపడ్డాయి.

గత 25 ఏళ్లలో ఈ స్థాయిలో మార్కెట్ పుంజుకోవడం ఇదే తొలిసారి. ఆసియా మార్కెట్లలో సానుకూల సంకేతాలు, అమెరికాలో బలహీనమైన ఉద్యోగాల డేటా,  చమురు సరఫరా పెరగడం వంటి అంశాలు ఈరోజు షేర్ మార్కెట్‌కు బలమైన కొండంత అండగా నిలిచాయి.

అక్టోబర్ 1, 2026 నాటికి BSE లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ 4.68 లక్షల కోట్లుగా ఉండేది. ఈ రోజు (అక్టోబర్ 5, 2026) స్టాక్ మార్కెట్ ముగిసేసరికి  4.69 లక్షల కోట్లకు చేరింది. దీనివల్ల ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ.1,06,363 కోట్లు పెరిగింది.

ఈరోజు  అత్యధికంగా లాభపడిన టాప్ షేర్లు చూస్తే ITC (4.49%), ఎటర్నల్ (2.50%), భారతి ఎయిర్‌టెల్ (2.38%), బజాజ్ ఫైనాన్స్ (2.28%), అదానీ పోర్ట్స్ (2.13%) ఉండగా.... HCL టెక్ (3.69%), HDFC బ్యాంక్ (1.99%), సన్ ఫార్మా (1.55%), ఇన్ఫోసిస్ (1.50%), ఏషియన్ పెయింట్స్ (1.43%) అత్యధికంగా నష్టపోయిన షేర్లుగా నిలిచాయి.