- 5 కిలోమీటర్ల పొడవున రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
- ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ అద్భుతమైన ఘట్టం
హర్యానాలోని పాల్వాల్‌లో దేశభక్తి ఉప్పొంగే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 5 కిలోమీటర్ల పొడవైన భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు. వేలాది మంది ప్రజలు జాతీయ జెండాను చేతబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుండగా పాల్వాల్ ప్రాంతం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాపట్ల గౌరవాన్ని చాటారు.
5 కిలోమీటర్ల త్రివర్ణ పతాక ప్రదర్శన కేవలం ప్రపంచ రికార్డు మాత్రమే కాదు.. భారతీయుల ఐక్యత, దేశభక్తి, జాతీయ గౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఈ అరుదైన ఘట్టం ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తిని మరింత పెంపొందించింది.
