KYC కోసం ఎన్ని కష్టాలో.. ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు... ఫన్నీ వీడియో షేర్ చేసిన మంత్రి

KYC కోసం ఎన్ని కష్టాలో.. ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు... ఫన్నీ వీడియో షేర్ చేసిన మంత్రి

ఇప్పుడు ప్రతీది కేవేసే చేయాల్సిందేనాయె. బ్యాంకు అకౌంట్.. రేషన్ కార్డు.. గ్యాస్ బుకింగ్.. ఇలా ప్రతీదానికి కేవైసీ లేకుంటే పనికాదు. అయితే కొందరికి కేవైసీ తొందరగానే అవుతుంటుంది. కానీ కొన్ని సార్లు బయోమెట్రిక్ లేదా ఐరిస్ ఎన్ని ముప్పుతప్పలు పెడుతుందో ఈ వీడియో ఉదాహరణ. నాగాలాండ్ మంత్రి షేర్ చేసిన కేవైసీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంత ఫన్నీ వీడియో అంటే ఇది.. చూస్తే నవ్వకుండా ఉండలేరు.

ఒక వ్యక్తి కోసం కమ్యూనిటీ మొత్తం కదిలి వచ్చి.. కేవేసీ ఇప్పటికైనా అవుతుందా అనేంత టెన్షన్ తో చూడటం.. కొందరు కేవైసీ కోసం ఏదో ఒక సాయం చేయడం..  ఒకరకంగా హాస్యం పండిస్తున్నా.. కేవైసీ తిప్పలు ఎలా ఉన్నాయో అనే అతిపెద్ద ఇష్యూని రైజ్ చేశారు. 

నాగాలాండ్ పర్యాటక, ఉన్నత విద్యా మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలాంగ్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెవైసీ (KYC) వెరిఫికేషన్ సమయంలో ఐరిస్ స్కాన్ చేయడంలో నాగాలాండ్ ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయో ఇది అద్దం పడుతోంది. 

వీడియోలో, బయోమెట్రిక్ స్కానర్ ఆ వ్యక్తి కన్నులను గుర్తించడంలో పదేపదే విఫలమవుతుంది. దీంతో చుట్టూ ఉన్న వ్యక్తులు అతని కనురెప్పలను పట్టుకుని తెరిచి ఉంచి స్కానర్‌కు సహాయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రయత్నాలు చూసి అక్కడ ఉన్నవారు నవ్వుతున్నారు. మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలాంగ్ ఈ క్లిప్‌ను “Struggle is real” (పోరాటం నిజం) అనే క్యాప్షన్‌తో ఎక్స్  లో పోస్ట్ చేశారు.

ఈ వీడియో హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ, బయోమెట్రిక్ టెక్నాలజీ వివిధ జాతుల లక్షణాలకు సరిపోయేలా డిజైన్ చేశారా అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈశాన్య భారతీయులకు కళ్లు చిన్నవిగా ఉండటం సహజం. అయితే ఐరిస్ స్కానర్లు సాధారణంగా అందరినీ దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. కానీ ఇలా చిన్న కళ్లు ఉన్న నాగా ప్రజల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కామెంట్ల రూపంలో వస్తున్నాయి. 

దీనిపై మంత్రి కూడా.. చిన్న కళ్లు అనే అంశంపై మంత్రి గతంలోనూ హాస్యంతో స్పందించారు. కొన్నిసార్లు  వ్యవస్థలో వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు నవ్వులతో పాటు, ప్రత్యామ్నాయ వెరిఫికేషన్ పద్ధతుల అవసరంపైనా చర్చలు చేస్తున్నారు.