నీళ్లు, కరెంట్‌‌ పొదుపుపై   ఊరూరా దండోరా!ఎల్‌‌నినోను ఎదుర్కొనేందుకు  సర్కారు ముందస్తు ప్లాన్

నీళ్లు, కరెంట్‌‌ పొదుపుపై   ఊరూరా దండోరా!ఎల్‌‌నినోను ఎదుర్కొనేందుకు  సర్కారు ముందస్తు ప్లాన్
  •     ఎల్‌‌నినోను ఎదుర్కొనేందుకు  సర్కారు ముందస్తు ప్లాన్
  •     నవంబర్ 1 నుంచే అమల్లోకి ఏడాది కాలపు సమగ్ర కార్యాచరణ
  •     విద్యుత్​ డిమాండ్​ 24 వేల మెగావాట్లకు చేరే చాన్స్
  •     డిమాండ్ అంచనాలతో ఉత్పత్తి పెంపు, కొనుగోళ్లపై ఫోకస్​
  •     రాష్ట్రంలోని 62 జలాశయాల్లో తాగునీటికే ఫస్ట్ ప్రయారిటీ
  •     డెడ్ స్టోరేజీల నుంచీ పంపింగ్‌‌కు ఏర్పాట్లు.. నిర్లక్ష్యం చేస్తే సస్పెన్షన్ 

 

 

హైదరాబాద్, వెలుగు: ముంచుకొస్తున్న ఎల్‌‌నినో   ప్రభావాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషనల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఎదురయ్యే తీవ్ర నీటి కొరత, విద్యుత్ డిమాండ్‌‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ‘పొదుపు దండోరా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. నీటిపారుదల, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్​ శాఖల అధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా నవంబర్ 1వ తేదీ నుంచే ఈ సమగ్ర కార్యాచరణను ప్రభుత్వం అమల్లోకి తేనున్నది. ప్రస్తుత  విద్యుదుత్పత్తి, డిమాండ్‌‌తో పాటు  జలాశయాల్లో నీటి నిల్వల లెక్కలను పరిశీలించిన సర్కార్​.. ఈ మేరకు  స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నది.  రాబోయే ఏడాది కాలానికి  తాగునీటి నిల్వలను ప్రాజెక్టులవారీగా కేటాయిస్తూ  బ్లూప్రింట్ ఖరారు చేశారు.  


ప్రాజెక్టుల నుంచి సాగునీటి కాలువల తూములను కట్టడి చేసి, కేవలం మనుషులు, పశువుల తాగునీటికే రిజర్వాయర్ల నీటిని వినియోగించాలని తీర్మానించారు. విద్యుత్​ విషయంలోనూ అదే తీరుగా కట్టడిగా ముందుకు వెళ్లాలని..  విధుల్లో ఏమాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమీక్షలో సీఎంవో తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఏ స్థాయిలో రికార్డులను తిరగరాసిందో ఈ నెల10 నుంచి 16 వరకు నమోదైన అధికారిక డేటాను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. అక్టోబర్ తొలి పక్షంలో రోజువారీ సగటు గరిష్ట డిమాండ్ 19,289 మెగావాట్లుగా ఉండగా, రోజూ సగటున 321.34 మిలియన్ యూనిట్ల భారీ వినియోగం జరిగింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 15వ తేదీ ఉదయం సరిగ్గా 10:29 గంటలకు రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా 20,003 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైంది. అదే ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 334.54 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం కావడం గమనార్హం.  ఇందులో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోనే అత్యధికంగా 12,281 మెగావాట్ల డిమాండ్ రికార్డు కాగా, ఉష్ణోగ్రతల సెగతో గ్రేటర్ హైదరాబాద్  పరిధిలో ఏకంగా 4,220 మెగావాట్ల ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్ పీక్ లోడ్ నమోదై ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో అధికారులను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే డిమాండ్ 20 వేల మెగావాట్లు దాటడంతో, రానున్న కాలంలో, మరి ముఖ్యంగా వేసవి సీజన్  నాటికి విద్యుత్ వినియోగం ఏ స్థాయికి చేరనుందో డిస్కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఇంధన శాఖ ముందస్తు లెక్కలు వేస్తున్నాయి.  ఏ నెలలో ఎలా ఉండబోతుందో అంచనా వేస్తూ ఆ మేరకు కొనుగోళ్లు, ఉత్పత్తి పెంచడంపై ఫోకస్​ పెట్టాయి.  

వ్యవసాయం, గృహ, పరిశ్రమలు, వాణిజ్య అవసరాలు కలిపి వచ్చే ఎండాకాలంలో రోజువారీ పీక్ లోడ్  24  వేలమెగావాట్లను దాటొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు పడిపోయి బోర్లపై ఆధారపడటమే ఈ పెను డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కారణమని గుర్తించిన అధికారులు,  విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) సవరించుకోవడంపై దృష్టి సారించారు. రికార్డు డిమాండ్ వేళ విద్యుత్ గ్రిడ్ భద్రత దెబ్బతినకుండా ఉండేందుకు సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్ల సామర్థ్యం పెంపు, ఆటోమేటిక్ లోడ్ షెడ్డింగ్ వ్యవస్థలు, సమగ్ర గ్రిడ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పునర్నిర్మాణ పనులను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో యంత్రాంగం వేగవంతం చేసింది. లోడ్ పెరిగినా ఫీడర్లు ట్రిప్ కాకుండా సాంకేతిక బలోపేతానికి నిరంతర నిఘా పెట్టింది.

ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై పక్కా లెక్క

అధికారులు సమర్పించిన తాజా నివేదికల ప్రకారం కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను విభాగాల వారీగా పక్కాగా లెక్కగట్టారు. మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లాలోని కొయిల్ సాగర్ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ 411.33 మీటర్లు కాగా, ప్రస్తుత వాటర్ లెవల్ 407.43 మీటర్ల వద్ద 0.983 టీఎంసీల నిల్వ ఉంది. నల్గొండ జిల్లా ఉదయసముద్రంలో 220 మీటర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుగానూ  1.525 టీఎంసీలు, ఖమ్మం జిల్లా పాలేరులో 133.90 మీటర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 2.558 టీఎంసీలు, ఆకేరులో 245 మీటర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 1.5 టీఎంసీల నీరుంది. వైరా ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 95.88 మీటర్ల లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 2.523 టీఎంసీలు, నాగార్జునసాగర్ పరిధిలోని పెండిపాకాల వద్ద 148.58 మీటర్ల వద్ద 1.03 టీఎంసీలు, టెయిల్ పాండ్ వద్ద 75.50 మీటర్ల మట్టంతో 7.080 టీఎంసీల నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ 318.52 మీటర్లు కాగా ప్రస్తుతం 9.657 టీఎంసీల నిల్వ ఉంది. నాగార్జునసాగర్, జూరాల ఆధారిత తాగునీటి పథకాలకు నెలకు 0.600 టీఎంసీల చొప్పున అవసరం కాగా.. రాబోయే 339 రోజులకు సరిపడా మున్సిపాలిటీలు , 320 గ్రామీణ ప్రాంతాలు  , మరో 2 అదనపు ఆవాసాలకు గ్రావిటీ, లిఫ్ట్ స్కీముల ద్వారా నీరందించేలా పక్కా ప్రణాళిక రచించారు. ఇదే తరహాలో గోదావరి బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రిజర్వాయర్ల తాగునీటి నిల్వలను ఇంజనీర్లు నిశితంగా లెక్కగట్టారు. నిర్మల్ జిల్లాలోని గడ్డెన్న ప్రాజెక్టు ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ 358.70 మీటర్లు కాగా, ప్రస్తుత మట్టం 357.10 మీటర్ల వద్ద ఒక టీఎంసీల నీరు ఉంది.

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 332.53 మీటర్ల గరిష్ట మట్టానికి గాను ప్రస్తుతం +328.605 మీటర్ల వద్ద 48.583 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కడెం ప్రాజెక్టులో 213.36 మీటర్ల వద్ద 2.839 టీఎంసీలు, కుమ్రం భీమ్ ప్రాజెక్టులో 148 మీటర్ల వద్ద 2.018 టీఎంసీల నీరు మాత్రమే లభ్యతగా ఉంది. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లిలో +148 మీటర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గాను 142.29 మీటర్ల వద్ద 18.175 టీఎంసీలు, సిరిసిల్లలోని మిడ్ మానేరు ప్రాజెక్టులో +318.00 మీటర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 316.33 మీటర్లతో 23.420 టీఎంసీలు ఉన్నాయి. కరీంనగర్ లోయర్ మానేరు వద్ద  290.48 మీటర్ల వద్ద 15.425 టీఎంసీలు, మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో +557.00 మీటర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గానూ 12.780 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు నిర్ధారించారు. గోదావరి పరివాహక గ్రామాలు, పట్టణాల్లో నీటి ఎద్దడి రాకుండా ఈ ప్రాజెక్టుల నుంచే నిరంతర సరఫరా అందించనున్నారు.

చివరి బొట్టు వరకూ తోడి తాగునీటి సరఫరా.. 

రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ, గ్రామీణ మంచినీటి సరఫరా  వ్యవస్థల కింద తాగునీరందించేందుకు మొత్తం 62 జలాశయాలను అనుసంధానించారు. ఇందులో కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 36 రిజర్వాయర్లు, గోదావరి బేసిన్ పరిధిలోని 26 జలాశయాలు పూర్తిస్థాయి మంచినీటి అవసరాలకు ప్రధాన మూలాధారంగా ఉన్నాయి. 2026 అక్టోబర్ నుంచి 2027 అక్టోబర్ వరకు రోజువారీ ఎండల తీవ్రత, నీటి ఆవిరి నష్టాలు లెక్కగడుతూ నెలవారీ డ్రా విధానాన్ని సిద్ధం చేశారు. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో పరిస్థితులు తీవ్రమై జలాశయాల్లో నీటిమట్టాలు కనిష్ట స్థాయికి  పడిపోతే తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై స్పష్టతనిచ్చారు. డెడ్ స్టోరేజ్ కంటే దిగువకు నీరు వెళ్లినప్పుడు అత్యవసర పంపింగ్ మోటార్లు అమర్చి, ప్రత్యేక ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టేక్ ఏర్పాట్ల  ద్వారా చివరి బొట్టు వరకు తోడి తాగునీటి సరఫరాకు ఎక్కడా లోటు రాకుండా చేయాలని ఆదేశించారు. ఇందుకోసం కాల్వల స్లూయిస్ గేట్లను కట్టుదిట్టం చేసి, సాగునీటి అక్రమ విడుదలను పూర్తిస్థాయిలో నిరోధించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
 
సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’

ఈ విపత్కర పరిస్థితులను క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షించేందుకు సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన ‘వార్ రూమ్’ను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయివరకు విధులు నిర్వహించే ప్రతి అధికారి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్​ శాఖలలో  చీఫ్ ఇంజినీర్లు, ఈఎన్సీలు, ఏఈఈ, డీఈఈ అధికారుల పనితీరుపై ప్రభుత్వం నిఘా పెట్టింది. వాటర్ గేట్లు, స్లూయిస్ లీకేజీలను తక్షణమే అరికట్టని ఇంజినీర్లను నేరుగా జవాబుదారీ చేయనున్నారు. మిషన్ భగీరథ పంపింగ్ స్టేషన్లు, విద్యుత్ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్ల పరిధిలో సరఫరాకు ఏ చిన్న విఘాతం కలిగినా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. క్షేత్రస్థాయి సమస్యలను ముందే పసిగట్టి పరిష్కరించడంలో విఫలమై, ప్రజలు రోడ్లెక్కే పరిస్థితి తీసుకొస్తే సంబంధిత అధికారులపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేస్తామని సర్కారు హెచ్చరించింది. ప్రజలకు నిరంతరం తాగునీరు అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది.   

ప్రజల్లోకి పొదుపు సూత్రాలు

తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ప్రతి చుక్క నీరు, ప్రతి యూనిట్ విద్యుత్ అత్యంత విలువైందని గుర్తించిన సర్కారు, పొదుపు సూత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉరూరా చాటింపులు వేయించాలని, గ్రామాల్లో వీడియోలు ప్రదర్శించాలని నిర్ణయించింది. స్థానిక గ్రామ పంచాయతీల ద్వారా ‘పొదుపు దండోరా’ వేయించనున్నారు.  వ్యవసాయ బోర్ మోటార్ల వద్ద ఆటోమేటిక్ స్టార్టర్లను నియంత్రించనున్నారు. ఆరుతడి పంటలపై రైతులకు ‘పొలం బాట’ ద్వారా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు నేరుగా అవగాహన కల్పించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెడ్ ట్యాంకుల నుంచి నల్లా నీరు పొంగిపోకుండా చూడటం, ఉదయం వేళల్లో గరిష్ట లోడ్ సమయంలో అనవసర గృహోపకరణాల వాడకాన్ని నిలిపివేయడంపై ప్రచారం చేయనున్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో వీధి దీపాలను సకాలంలో ఆన్-, ఆఫ్ చేయడం, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల పరిమిత వినియోగం, పరిశ్రమల్లో పవర్ సేవింగ్ పద్ధతులను తప్పనిసరి చేశారు. పవర్, వాటర్ కన్జర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సమన్వయం చేస్తూ  ప్రచార డ్రైవ్ చేపట్టనున్నారు.