- ఈనెల 26 నుంచి నవంబర్ 9 వరకు గడువు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 26 నుంచి నవంబర్ 9 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు కట్టొచ్చు. రూ. 2వేల ఫైన్తో డిసెంబర్ 9 నుంచి 14 వరకు గడువు ఉంది. ఫస్టియర్ రెగ్యులర్, సెకండియర్ జనరల్ ఆర్ట్స్ విద్యార్థులకు పరీక్ష ఫీజును రూ. 540గా నిర్ణయించారు. అలాగే సెకండియర్ జనరల్ సైన్స్, ఫస్టియర్, సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులకు మొత్తం రూ. 890గా ఖరారు చేశారు.
