హైదరాబాద్ సిటీ, వెలుగు: దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ 7 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 10 నుంచి ఇప్పటివరకు సుమారు 95 శాతం ప్రత్యేక బస్సులను నడిపినట్లు సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు.
ఈ నెల 17, 18, 19 తేదీల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం జూబ్లీ బస్స్టేషన్ (జేబీఎస్)ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సీహెచ్.వెంకన్న, శ్రీధర్లతో కలిసి పరిశీలించారు. ప్రత్యేక బస్సుల వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని కోరారు.
