జోగినపల్లి శ్రీనివాసరావుకు కేసీఆర్ నివాళి

జోగినపల్లి శ్రీనివాసరావుకు కేసీఆర్ నివాళి

అనారోగ్యంతో మృతి చెందిన తన బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు భౌతిక కాయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళి అర్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రి  హరీష్ రావు  ఉన్నారు.

అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ బావమరిది,జోగినపల్లి శ్రీనివాస్ రావు  ఆగస్టు 13న  తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.  వెంటనే ఆయన ఇంటికి వెళ్లిన కేటీఆర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి  శ్రీనివాస్ రావు కుటుంబ సభ్యులను  పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు.