రాజన్న సిరిసిల్ల పట్టణంలోని పెద్దూరు విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకులో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. బంకులో పార్కింగ్ చేసి ఉన్న ఒక కారును, అక్కడ పనిచేసే సిబ్బంది ఒకరు పక్కకు జరిపే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అకస్మాత్తుగా కారు అదుపుతప్పింది. వేగంగా వెళ్లి నేరుగా పెట్రోల్ పంపింగ్ మిషన్‌ను ఢీకొట్టింది.
దీని తీవ్రతకు పెట్రోల్ మిషన్ ఒక్కసారిగా విరిగి కిందపడిపోయింది. అయితే, అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పెను ప్రమాదం తప్పుడంతో బంకు సిబ్బంది, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
