హైదరాబాద్ సిటీ, వెలుగు: మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ వద్ద ఉన్న జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆఫీస్లో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వందన ఒక ప్రకటనలో తెలిపారు. రిలయన్స్ జియో సంస్థ ఆధ్వర్యంలో 100 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. డిప్లొమా(ఈఈఈ/ఈసీఈ) అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అప్రెంటిస్షిప్(రూ.12 వేలు సీటీసీ), ఎన్-డెట్(రూ.25 వేలు సీటీసీ), ఫీల్డ్ ఇంజినీర్ (రూ.33,333 సీటీసీ) పోస్టులను భర్తీ చేస్తారని తెలిపారు. అర్హత, ఆసక్తి గల నిరుద్యోగ యువకులు విద్యార్హత సర్టిఫికెట్లతోపాటు జిరాక్స్ కాపీలతో ఉదయం 11 గంటలకు హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 93462 04294 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.
