లేఅవుట్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..మౌలిక సదుపాయాల విషయంలో ఇబ్బందులు రాకూడదు

లేఅవుట్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..మౌలిక సదుపాయాల విషయంలో  ఇబ్బందులు రాకూడదు

కందనూలు, వెలుగు:  నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రైవేటు ప్లాట్ల లేఅవుట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరగాలని, రూల్స్​ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ హెచ్చరించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం, మెడికల్ కళాశాల, ఎస్పీ కార్యాలయాల ఎదురుగా ఉన్న ప్రైవేటు లేఅవుట్లను ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆయన పరిశీలించారు.

భవిష్యత్​లో ప్రజలకు రహదారులు, మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు అలర్ట్​గా ఉండాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు సిబ్బంది ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ కోసం సుమారు రూ.8 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన ఇండోర్ షటిల్ కోర్టును ప్రారంభించారు.  స్వాతంత్ర్య దినోత్సవాల్లోఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా ఉండేందుకు పోలీస్ పెరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.