గద్వాల, వెలుగు: కర్నాటక ప్రాజెక్టుల నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో జూరాల ప్రాజెక్టు దగ్గర గురువారం అన్ని గేట్లను క్లోజ్ చేశారు. హైడల్ ప్రాజెక్టు దగ్గర కూడా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు దగ్గర 4.187 టీఎంసీల స్టోరేజీ ఉంది. 11 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తున్నది. లిఫ్టులు, ఇతర అవసరాల కోసం 5,554 క్యూసెక్కుల నీటిని వాడుకుంటున్నారు.
