మాకు 70.. తెలంగాణకు 30 శాతమే...కృష్ణా బోర్డుకు నీటి కోసం ఏపీ ఇండెంట్

మాకు 70.. తెలంగాణకు 30 శాతమే...కృష్ణా బోర్డుకు నీటి కోసం ఏపీ ఇండెంట్

హైదరాబాద్, వెలుగు: కృష్ణాలో నీటి వినియోగంపై ఏపీ మరోసారి తన వంకరబుద్ధిని చాటుకుంది. కామన్​ప్రాజెక్టుల్లో ఉన్న నీళ్లలో ఎక్కువ వాటా తమకే ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు ఏపీ ఇండెంట్ పెడుతూ లేఖ రాసింది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌‌లో153 టీఎంసీలు, శ్రీశైలంలో 184 టీఎంసీల నీళ్లున్నాయని లేఖలో పేర్కొంది. 

అందులో డెడ్​స్టోరేజ్‌కు ఎగువన ఉన్న నీళ్లలో 70 శాతం తమకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అదే సమయంలో తెలంగాణకు మాత్రం 30 శాతం పంచాలని లేఖలో బోర్డును కోరింది. అయితే, ఆ నీటిని సాగు అవసరాల కోసం కాకుండా కేవలం తాగునీటి కోసమే వినియోగించుకునేలా చూడాలని కోరింది. కాగా, గురువారం త్రీమెన్​కమిటీ మీటింగ్‌ను నిర్వహించాల్సి ఉన్నా.. ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీల అభ్యర్థన మేరకు మీటింగ్‌ను సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.