గంగాధర, వెలుగు: గర్శకుర్తి మండలం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నానని, చేనేత హబ్‌గా తీర్చిదిద్దుతానని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గురువారం గంగాధర ప్రజా కార్యాలయాలనికి వెళ్లిన ఎమ్మెల్యేను గర్శకుర్తి గ్రామస్తులు కలిసి తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు.
స్పందించిన ఎమ్మెల్యే అసెంబ్లీలో తీర్మానం చేసిన సమయంలో గర్శకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్, సర్పంచ్ చిందం ఆంజనేయులు, నాయకులు రాజేశం, చక్రపాణి, రాజమౌళి, ఎ.శ్రీనివాస్, కె.రాజు, మల్లికార్జున్ పాల్గొన్నారు.
